INSURANCE AT VERY PREMIUM KNOW ABOUT PRADHAN MANTRI JEEVAN JYOTI BIMA YOJANA ALL YOU NEED TO KNOW AK GH
PMJJBY: రూ. 330 కడితే రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ కవరేజీ... తక్కువ రేటులో ఇంతకన్నా మంచి పాలసీ మరొకటి లేదు
(ప్రతీకాత్మక చిత్రం)
లబ్ధిదారుడు ప్రీమియంను బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా, ECS (ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీసెస్) ద్వారా చెల్లించే ఆప్షన్ సైతం అందుబాటులో ఉంది. ఇలా బ్యాంక్ అకౌంట్ ద్వారా ప్రీమియం చెల్లించిన తరువాత.. ఆటోమెటిక్‌గా పాలసీ రెన్యువల్ అవుతుంది.
ప్రతి వ్యక్తికి జీవిత బీమా కల్పించాలనే లక్ష్యంతో వివిధ ఇన్సూరెన్స్ పాలసీలకు రూపకల్పన చేసింది కేంద్ర ప్రభుత్వం. వీటిలో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) ప్రధానమైనది. PMJJBY కింద ఒక వ్యక్తి సంవత్సరానికి కేవలం రూ.330 ప్రీమియంతో రూ.2 లక్షల వరకు బీమా కవరేజీ పొందవచ్చు. వెనుకబడిన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన బీమా రక్షణ అందిస్తుంది.
PMJJBY పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ), ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అందిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ద్వారా ఈ పాలసీ తీసుకోవచ్చు. లబ్ధిదారుడు ఏదైనా కారణంతో మరణిస్తే.. PMJJBY కింద వారి కుటుంబానికి ప్రభుత్వం రూ.2 లక్షలు బీమా మొత్తం అందిస్తుంది. 18 నుంచి 50 సంవత్సరాల వయసు వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. దీని మెచూరిటీ 55 సంవత్సరాలుగా ఉంది.
* సులభంగా పాలసీ తీసుకునే అవకాశం
పాలసీ కవరేజీ కోసం PMJJBY లబ్ధిదారులు ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. అకౌంట్ ఉన్న బ్యాంకు బ్రాంచును సంప్రదించి, ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు అవసరం లేకుండా పాలసీ తీసుకోవచ్చు. బీమా తీసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 50 సంవత్సరాలుగా ఉంది. PMJJBY వార్షిక ప్రీమియం కేవలం రూ.330 మాత్రమే కావడం విశేషం. లబ్ధిదారుడికి 55 ఏళ్లు నిండిన తరువాత ఈ పాలసీ మెచూరిటీ పూర్తవుతుంది. ఇందులో ఎలాంటి మెచూరిటీ బెనిఫిట్ ఉండదు.
లబ్ధిదారుడు ప్రీమియంను బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా, ECS (ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీసెస్) ద్వారా చెల్లించే ఆప్షన్ సైతం అందుబాటులో ఉంది. ఇలా బ్యాంక్ అకౌంట్ ద్వారా ప్రీమియం చెల్లించిన తరువాత.. ఆటోమెటిక్‌గా పాలసీ రెన్యువల్ అవుతుంది.
పాలసీ తీసుకున్న మొదటి 45 రోజుల వరకు ఈ పథకం కింద డబ్బును క్లెయిమ్ చేసుకోలేరు. కానీ ఏదైనా ప్రమాదం కారణంగా దరఖాస్తుదారుడు మరణించినప్పుడు ఈ నిబంధన వర్తించదు. PMJJBY పథకం కింద ప్రతి సంవత్సరం జూన్ 1 నుంచి మే 31 వరకు మాత్రమే బీమా రక్షణ లభిస్తుంది. పాలసీ రెన్యువల్ చేయడానికి బ్యాంక్ అకౌంట్లో ప్రీమియం మొత్తానికి సమానమైన డబ్బు లేకపోయినా.. లేదా బ్యాంక్ అకౌంట్ మూసివేసినా.. ఈ బీమా పాలసీ రద్దు అవుతుంది.
ఈ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో లబ్దిదారులుగా నమోదైన వ్యక్తులు పథకం నుంచి బయటకు వెళ్తే.. మళ్లీ వార్షిక ప్రీమియం చెల్లించి లబ్దిదారులుగా చేరవచ్చు. మొదటిసారి పాలసీ తీసుకున్నప్పుడు బ్యాంకు అకౌంట్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. కానీ ఒకసారి బయటకు వెళ్లి, మళ్లీ కవరేజీ పొందాలనుకున్నప్పుడు మాత్రం హెల్త్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. పాలసీదారులు మరణించినప్పుడు, వారి బ్యాంకు అకౌంట్ ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం నామినీ దరఖాస్తు చేసుకోవచ్చు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.