INSURANCE ARE YOU TAKING AN INSURANCE POLICY INCREASE YOUR CHANCES OF GETTING AN EASY CLAIM GH VB
Insurance: ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా..? క్లెయిమ్ ఈజీగా పొందే అవకాశాలను ఇలా పెంచుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
కుటుంబాల రక్షణకు ఇన్సూరెన్స్ పాలసీ(Insurance Policy)లు అవసరం. ఓ వ్యక్తి ఆకస్మిక మరణం, ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, ఆస్తుల సంరక్షణ వంటి వాటి నుంచి ఆర్థికంగా కుటుంబాన్ని రక్షించడానికి ఇన్సూరెన్స్ పాలసీ తోడ్పడుతుంది.
కుటుంబాల రక్షణకు (security) ఇన్సూరెన్స్ పాలసీ(Insurance Policy)లు అవసరం. ఓ వ్యక్తి ఆకస్మిక మరణం, ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, ఆస్తుల సంరక్షణ వంటి వాటి నుంచి ఆర్థికంగా కుటుంబాన్ని రక్షించడానికి ఇన్సూరెన్స్ పాలసీ(Insurance Policy) తోడ్పడుతుంది. పదవీ విరమణతో పాటు పిల్లల చదువులు, వివాహం వంటి భవిష్యత్తు(Future) లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. అయితే పాలసీ క్లెయిమ్(Claim) ఈజీగా(Easy) పొందేందుకు కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలి. అవేంటంటే..
* ఆరోగ్య పరిస్థితులను దాచడం సరికాదు
ఇన్సూరెన్స్ పాలసీని ఏ అవసరం కోసం కొనుగోలు చేసినా, క్లెయిమ్‌ల సమయంలోనే జాగ్రత్తగా ఉండాలి. క్లెయిమ్ చేసే సమయంలో ముఖ్యమైన డాక్యుమెంట్ ఇన్సూరెన్స్ పాలసీకి దరఖాస్తు చేసేటప్పుడు పూరించే ప్రపోజల్ ఫారమ్. కొందరు ఈ డాక్యుమెంట్‌పై సంతకం చేసి, వివరాలను పూరించమని ఏజెంట్‌కు చెప్తారు. ఏజెంట్‌కి, ఆరోగ్య పరిస్థితులు, ఇతర ముఖ్యమైన సమాచారం గురించి తెలియక, అతని అత్యుత్తమ పరిజ్ఞానం ఆధారంగా దాన్ని పూరించడానికి మొగ్గు చూపుతారు. దీంతో కీలక సమాచారాన్ని వారు విస్మరించవచ్చు.
ప్రపోజల్ ఫారమ్ అన్ని ఇన్సూరెన్స్ ఒప్పందాలకు ఆధారం. ఇన్సూరెన్స్ కంపెనీ, ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి మధ్య ఒప్పందంలో భాగం. అందులో పాలసీ పొందిన వ్యక్తి వ్యక్తిగత వివరాలు, ఇన్సూరెన్స్ చరిత్ర, ఇన్సూరెన్స్ చేసిన అంశానికి సంబంధించిన సమాచారం ఉంటాయి.
ఆరోగ్య బీమాకు అత్యంత సాధారణ కారణాలలో ఒకటి హైపర్‌టెన్షన్, మధుమేహం, థైరాయిడ్, సర్జరీలు మొదలైన వాటిని బహిర్గతం చేయకపోవడం. ఇవే క్లెయిమ్ తిరస్కరణకు అత్యంత సాధారణ కారణాలు. సాధారణంగా ప్రపోజల్ ఫారమ్‌లో 8- 10 వైద్య సంబంధ ప్రశ్నలు ఉంటాయి. వాటిని చదివి సరిగ్గా సమాధానం ఇవ్వాలి. మొత్తం సమాచారాన్ని విధిగా పేర్కొనాలి. మునుపటి ఇన్సూరెన్స్ పాలసీలను తెలియజేయనందుకు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు తిరస్కరించిన ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి కొత్త పాలసీని కొనుగోలు చేసే సమయంలో అప్పటికి ఉన్న, పాత పాలసీ లన్నింటినీ ప్రస్తావించాలి.
జీవనశైలి, అలవాట్లు, ఆదాయ వివరాలు ముందే ప్రస్తావించాలి
పొగాకు, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను తెలియజేయకపోవడం కూడా క్లెయిమ్ తిరస్కరణకు దారితీయవచ్చు. వీటిలో ఏదైనా అప్పుడప్పుడూ చేస్తున్నా అన్నింటినీ ఫారమ్‌లో పేర్కొనాలి. బీమా కవర్ కోసం దరఖాస్తు చేసే సమయంలో వృత్తి కూడా ముఖ్యం. ఎక్కువ రిస్క్ ఉన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కొనుగోలు చేసేటప్పుడు మీరు సరైన జీతం, ITR వివరాలను ప్రకటించాలి. తప్పుడు ఆదాయ ప్రకటన ఆధారంగా బీమా కవరేజీని కొనుగోలు చేసినట్లయితే, క్లెయిమ్ తిరస్కరించవచ్చు.
నామినీ వివరాలను అప్డేట్ చేయాలి
చాలా మంది పాలసీ డాక్యుమెంట్లలో నామినీ పేరును పరిశీలించరు. ఉదాహరణకు పాలసీలో పేర్కొన్న నామినీ ముందుగానే మరణిస్తే.. ఇన్సూరెన్స్ సంస్థకు చట్టబద్ధమైన వారసుడి సరైన వివరాలు అవసరం కాబట్టి క్లెయిమ్ సెటిల్మెంట్ సంక్లిష్టంగా మారవచ్చు. నామినీ పేరును పరిస్థితుల ఆధారంగా అప్డేట్ చేయాలి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.