మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? పాన్ కార్డ్ లేకపోతే ఇకపై మీరు కొన్ని రోజుల పాటు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. 10 నిమిషాల్లో పాన్ కార్డు తీసుకోవచ్చు. ఉచితంగానే పాన్ కార్డ్ పొందొచ్చు. ఇందుకోసం మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉంటే చాలు. మీ ఆధార్ నెంబర్‌తో పాన్ కార్డు జనరేట్ చేయడం చాలా సులువు. ఈ కొత్త సదుపాయాన్ని ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించింది. ఆధార్ కార్డుతో ఇన్‌స్టంట్‌గా ఆన్లైన్లో పాన్ కార్డు తీసుకోవచ్చు. పాన్ కార్డు పొందడానికి మీరు ఆన్లైన్లో దరఖాస్తు ఫామ్ నింపాల్సిన అవసరం కూడా లేదు. కేవలం మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తే చాలు. ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తవుతుంది. కేవలం 10 నిమిషాల్లో పీడీఎఫ్ ఫార్మాట్లో పాన్ కార్డు వస్తుంది. ఒకవేళ మీకు లామినేటెడ్ పాన్ కార్డ్ కావాలంటే రూ.50 చెల్లించి ఆర్డర్ చేయొచ్చు. మీకు పోస్ట్ ద్వారా పాన్ కార్డ్ లభిస్తుంది. మరి ఆన్లైన్లో 10 నిమిషాల్లో ఉచితంగా పాన్ కార్డ్ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.

ప్రతీకాత్మక చిత్రం
Instant PAN through Aadhaar: ఆన్లైన్లో ఆధార్ నెంబర్‌తో పాన్ కార్డ్ పొందండి ఇలా
ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇ-ఫైలింగ్ పోర్టల్
https://www.incometaxindiaefiling.gov.in/ ఓపెన్ చేయండి.
ఎడమవైపు Quick Links కింద Instant PAN through Aadhaar లింక్‌పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Get New PAN ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
మీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Generate Aadhaar OTP పైన క్లిక్ చేయండి.
మీ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి మీ ఆధార్ వివరాలు సరిచూసుకోవాలి.
మీ ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI దగ్గర రిజిస్టర్ అయిన మీ ఆధార్ వివరాలు ఆదాయపు పన్ను శాఖకు వెళ్తాయి.
ఆ తర్వాత మీకు ఇ-పాన్ వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం 10 నిమిషాల్లో పూర్తవుతుంది.
Check Status/ Download PAN పైన క్లిక్ చేసి మీ ఇ-పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మీ ఇ-పాన్ కార్డు పీడీఎఫ్ ఫార్మాట్లో మీ ఇమెయిల్ ఐడీకి వస్తుంది.
ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించిన ఇన్స్టంట్ పాన్ కార్డు సదుపాయం ఇప్పటివరకు పాన్ నెంబర్ లేనివారి కోసం మాత్రమే. ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు పాన్ నెంబర్ అలాట్ కానివారు మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. ఆధార్ నెంబర్‌కు తప్పనిసరిగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. దాంతో పాటు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఆధార్ కార్డులో పూర్తిగా ఉండాలి. మైనర్లు ఇన్స్టంట్ ఇ-పాన్ కార్డు తీసుకోలేరు.
ఇక పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి మార్చి 31 చివరి తేదీ. మీ పాన్-ఆధార్ ఎలా లింక్ చేయాలో
ఇక్కడ క్లిక్ చేయండి. మీరు గతంలోనే పాన్-ఆధార్ లింక్ చేసినట్టైతే స్టేటస్ తెలుసుకోవడానికి
ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
Pan Card: మార్చి 31 తర్వాత పాన్-ఆధార్ లింక్ చేయొచ్చు... కానీ ఓ ట్విస్ట్ ఉంది
PAN card rule: మీరు ఆఫీసులో పాన్ నెంబర్ ఇవ్వకపోతే జీతంలో కోత తప్పదు
PAN Card: రెండు పాన్ కార్డులు ఉన్నాయా? ఇలా చేయండి