Home /News /business /

Instant Loan Apps: యాప్‌ల‌లో లోన్ తీసుకొంటున్నారా..? అయితే ఈ విష‌యాలు గుర్తుంచుకోవాల్సిందే

Instant Loan Apps: యాప్‌ల‌లో లోన్ తీసుకొంటున్నారా..? అయితే ఈ విష‌యాలు గుర్తుంచుకోవాల్సిందే

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Instant Loan Apps: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఓ నివేదిక విడుద‌ల చేసింది. ఈ నివేదిక ఆధారంగా దేశంలో ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌లలో దాదాపు 1,100 ఆన్‌లైన్ లోన్ యాప్‌లు ఉన్నాయని వెల్లడించింది. ఈ ఆండ్రాయిడ్ (Android) యాప్‌ల‌లో 600 పైగా చ‌ట్ట విరుద్ధంగా ఉన్న‌ట్టు ఆర్‌బీఐ (RBI) గుర్తించింది. ఈ నేప‌థ్యంలో యాప్‌ల‌లో లోన్ తీసుకొనే ముందు పాటించాల్సిన రూల్స్ తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reseve Bank of India) ఇటీవల ఓ నివేదిక విడుద‌ల చేసింది. ఈ నివేదిక ఆధారంగా దేశంలో ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌లలో దాదాపు 1,100 ఆన్‌లైన్ లోన్ యాప్‌ (Loan apps)లు ఉన్నాయని వెల్లడించింది. ఈ ఆండ్రాయిడ్ యాప్‌ల‌లో 600 పైగా చ‌ట్ట విరుద్ధంగా ఉన్న‌ట్టు ఆర్‌బీఐ గుర్తించింది. ఈ నేప‌థ్యంలో స్కామ్‌లను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంక్ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ ఈ డిజిటల్ లెండింగ్ యాప్‌ల నియంత్ర‌ణ కోసం చట్టాన్ని రూపొందించాల‌ని కోరింది. ఇటీవ‌ల కాలంలో లోన్ యాప్‌ల స్కామ్‌లు త‌రచుగా బ‌య‌ట‌ప‌డ‌డం ప‌లు చోట్ల ఫిర్యాదులు రావ‌డంతో వీటిపై నియంత్ర‌ణ అవ‌స‌రం అనే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. ఫైనాన్స్ రంగంలో సాంకేతిక పురోభివృద్ధ ఆహ్వానించ‌ద‌గ్గ‌దే అయిన‌ప్ప‌టికీ వాటిపై నియంత్ర‌ణ అవ‌స‌రం. క‌స్ట‌మ‌ర్ డేటా గోప్య‌త‌ (Data Security), చ‌ట్ట‌విరుద్ధ‌మైన పెట్టుబ‌డులు వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన అవ‌ర‌సం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేసింది.

  లోన్ తీసుకొనే ముందు జాగ్ర‌త్త‌..
  ఈ హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని, కేంద్రం లేదా RBI కొత్త నిబంధనలను తీసుకొచ్చే వరకు, వినియోగదారులు ఈ ఇన్‌స్టంట్ డిజిటల్ లోన్ యాప్‌ (Instant Digital Loan app)ల నుంచి రుణం తీసుకునేటప్పుడు కొన్ని థంబ్ నియమాలను పాటించడం చాలా ముఖ్యం.

  Telangana MLC Elections: తెలంగాణ‌లో రాజ‌కీయ వేడీ.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఏం జ‌రుగుతోంది!


  ఆర్‌బీఐ త‌న నివేదిక‌లో ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించింది. రుణాలు అందించే యాప్‌ల‌కు సంబంధించి ప్రాథ‌మికంగా ధ్రువీక‌ర‌ణ పొందేదుకు నోడ‌ల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాల‌ని సూచించ‌ది.

  రుణం తీసుకొనే ముందు తెలుసుకోవాల్సిన‌వి..
  - మీరు యాప్‌ల ద్వారా రుణం తీసుకోవాల‌నుకొంటే ముందుగా ఆ కంపెనీ ఆర్‌బీఐలో రిజిస్ట‌ర్ అయి ఉందా లేదా చూసుకోవాలి.
  - దీని ద్వారా రుణాన్ని తిరిగి చెల్లించేటప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవు.
  - ఆర్‌బీఐ కేవైసీ నిబంధ‌న‌లు పాటించ‌ని వారి వ‌ద్ద రుణం తీసుకోకుడ‌దు.

  ప‌రిశీలించాల్సిన అంశాలు..
  - లోన్ ఇచ్చే యాప్‌కు వెబ్‌సైట్ ఉందాల లేదా ప‌రిశీలించుకోవాలి.
  - యాప్ రివ్యూల‌ను ప్లేస్టోర్‌లో చ‌ద‌వాలి.
  - లోన్ అందించే యాప్ ఏదైనా బ్యాంక్ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ (Banking Finance) కంపెనీతో ప‌నిచేస్తుందో ఓసారి ప‌రిశీలించుకోవాలి.
  - ఆర్‌బీఐ లేదా ఎన్‌బీఎఫ్‌సీ వెబ్‌సైట్‌ల‌లో యాప్ ధ్రువీక‌ర‌ణ‌ను ప‌రిశీలించుకోవాలి.

  NEET 2021 Counselling: త్వ‌ర‌లో నీట్ కౌన్సెలింగ్‌.. ఎన్‌టీఏ తాజా ప్ర‌క‌ట‌న‌


  నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా చ‌ద‌వాలి..
  - లోన్ తీసుకొనేట‌ప్పుడు 'ప్రొసీడ్' బటన్‌పై క్లిక్ చేసే ముందు అన్ని అంశాల‌ను పూర్తిగా చ‌ద‌వాలి.
  - ష‌ర‌తుల‌ను క‌చ్చితంగా చ‌ద‌వాలి.
  - లోన్ చెల్లింపు ఆల‌స్యం అయితే ఎలాంటి ష‌ర‌తులు ఉన్నాయో చూసుకోవాలి.
  - పూర్తి వివరాలు చ‌ద‌వకుండా లోన్ తీసుకుంటే ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉంది.

  త‌క్కువ వ‌డ్డీ కోసం చూడ‌కండి..
  సాంకేతికత వినియోగం పెరగడం వల్ల రుణాలు తీసుకోవడానికి సంబంధించిన సైబర్ నేరాలు (Cyber Crime) పెరిగాయి కాబట్టి ధృవీకరించబడని లోన్ యాప్‌ల వ‌ద్ద లోన్‌లు తీసుకోకండి. బ్యాంక్ వివరాలు, క్రెడిట్ కార్డ్ పిన్ లేదా చిరునామాల వంటి వ్యక్తిగత వివరాలను అడిగే యాప్‌ల విష‌యంలో జాగ్ర‌త్త అవ‌స‌రం . అన్నింటికంటే మీరు పరిశీలించవలసిన వడ్డీ రేట్లు కాకుండా అనేక ఇతర అంశాలపై దృష్టి పెట్టాలి. ప్రీ-పేమెంట్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు లేదా ప్రీ-క్లోజర్ ఛార్జీలు ఎక్కువగా ఉంటే, మీరు ఆ యాప్‌లకు దూరంగా ఉండాలి.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Bank loans, CYBER CRIME, Loan apps, Rbi

  తదుపరి వార్తలు