హోమ్ /వార్తలు /బిజినెస్ /

Moonlighting: మూన్‌లైటింగ్‌పై ఉద్యోగులకు ఇన్ఫోసిస్ వార్నింగ్.. ఉద్యోగం పోతుందని హెచ్చరిక

Moonlighting: మూన్‌లైటింగ్‌పై ఉద్యోగులకు ఇన్ఫోసిస్ వార్నింగ్.. ఉద్యోగం పోతుందని హెచ్చరిక

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Infosys: ఉద్యోగులు ఇళ్లలో ఉండి, తీరిక లేకుండా రెండు జాబ్‌లు చేయడం వల్ల ప్రొడక్టివిటీ తగ్గుతోందని ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. మూన్‌లైటింగ్‌ చేస్తున్నట్లు తేలితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో దాదాపు అన్ని ఐటీ సంస్థలు వర్క్‌ ఫ్రమ్‌ హోం అమలు చేశాయి. ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఉద్యోగులు కంపెనీలకు వచ్చి పని చేయడం లేదు. అయితే లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగులు ఒక కంపెనీలో పని చేస్తూ, అదనంగా ఇతర జాబ్స్ కూడా చేస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగులు(IT Employees) రెండు జాబ్స్ చేయడాన్ని మూన్‌లైటింగ్‌(Moonlighting)గా పేర్కొంటున్నారు. ఉద్యోగులు ఇళ్లలో ఉండి, తీరిక లేకుండా రెండు జాబ్‌లు చేయడం వల్ల ప్రొడక్టివిటీ తగ్గుతోందని ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. మూన్‌లైటింగ్‌ చేస్తున్నట్లు తేలితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నాయి.

* ఇన్ఫెసిస్‌ వార్నింగ్

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్(Infosys) లిమిటెడ్ తాజాగా మూన్‌లైట్‌పై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పింది. మూన్‌లైటింగ్‌ కంపెనీ నిబంధనలకు విరుద్ధమని, ఉద్యోగి కాంట్రాక్ట్‌ను రద్దు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఓ ఇంటర్నల్‌ పోస్ట్‌లో ఇన్ఫోసిస్‌.. కంపెనీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ మేరకు ఇన్ఫోసిస్‌ ఉద్యోగి మరో కంపెనీలో రెండో జాబ్‌ చేసేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

* తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఐటీ దిగ్గజాలు

ఇన్ఫోసిస్ లేఖకు కొన్ని వారాల ముందు విప్రో తన ఉద్యోగులను మూన్‌లైటింగ్‌పై హెచ్చరించింది. ఇన్ఫోసిస్ ఈమెయిల్ విప్రోకు చెందిన రిషద్ ప్రేమ్‌జీ ట్వీట్‌ను ప్రతిబింబించింది. ఆయన మూన్‌లైట్‌ను మోసంగా అభివర్ణించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్. గణపతి సుబ్రమణ్యం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. మూన్‌లైటింగ్‌ దీర్ఘకాలంలో పని చేయదని అన్నారు. యజమానులు నైతికత, సరైన ప్రవర్తనను పెంపొందించుకోవాలని, స్వల్పకాలిక లాభాల కోసం ఇలాంటివి చేస్తే, దీర్ఘకాలికంగా నష్టపోతారని వివరించారు.

* నో టూ టైమింగ్‌, నో మూన్‌లైటింగ్‌

సెప్టెంబర్ 12న, ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు మూన్‌లైటింగ్ కాంట్రాక్ట్ రద్దుకు దారితీస్తుందని హెచ్చరిస్తూ ఈమెయిల్ పంపింది. ‘రిమెంబర్‌- నో టూ టైమింగ్‌- నో మూన్‌లైటింగ్‌’ అని పేర్కొంటూ ఇన్ఫోసిస్ హెచ్‌ఆర్‌లు ఈమెయిల్ పంపారు. మెయిల్‌లో కంపెనీ మూన్‌లైటింగ్‌ను సాధారణ వ్యాపార సమయాల్లో లేదా వెలుపల రెండో ఉద్యోగం చేసే పద్ధతిగా వివరించింది. కంపెనీ ఉద్యోగుల హ్యాండ్‌బుక్ ప్రకారం రెండు జాబ్‌లు చేయడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఆఫర్ లెటర్‌లలో కూడా.. ఇన్ఫోసిస్ అనుమతి లేకుండా ఉద్యోగి ఏ సంస్థలోనూ పూర్తి సమయం లేదా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేయలేరని స్పష్టం చేసినట్లు పేర్కొంది.

HCL Lays Off : ఉద్యోగుల ఏరివేత మొదలెట్టిన టెక్ కంపెనీలు..HCLలో భారీగా ఉద్యోగుల తొలగింపు!

Central Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఆ ఫీజు లిమిట్ పెంపు..

* ప్రొడక్టివిటీపై ప్రభావం

ఇన్ఫోసిస్‌లో ఉద్యోగి హ్యాండ్‌బుక్, ప్రవర్తనా నియమావళి ప్రకారం రెండు జాబ్‌లు చేయడానికి అనుమతి లేదు. మీ ఆఫర్ లెటర్‌లో స్పష్టంగా పేర్కొన్నట్లుగా, ఇన్ఫోసిస్ సమ్మతి లేకుండా ఏదైనా ఇతర సంస్థ/ఎంటిటీలో డైరెక్టర్/ భాగస్వామి/ సభ్యుడు/ ఉద్యోగిగా పూర్తి సమయం లేదా పార్ట్‌టైమ్ ఉద్యోగాన్ని తీసుకోకూడదని మీరు అంగీకరించారు. కంపెనీ ఏవైనా నిబంధనలు, షరతులకు లోబడి అనుమతి ఇవ్వవచ్చు, కంపెనీ అభీష్టానుసారం ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చని ఇన్ఫోసిస్‌ ఈమెయిల్‌లో వివరించినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. రిమోట్ వర్క్‌కి మారడం వల్ల మూన్‌లైటింగ్‌ పెరిగిందని కంపెనీ పేర్కొంది. ఐటీ ఉద్యోగులకు రెండవ ఉద్యోగం చేయడం సులభతరంగా మారిందని తెలిపింది. ఇది ప్రొడక్టివిటీ, ఉద్యోగ పనితీరు, డేటా ప్రమాదం, రహస్య సమాచారం లీకేజీ వంటి వాటిపై ప్రభావం చూపుతుందని, వ్యాపారానికి తీవ్రమైన సవాళ్లను కలిగిస్తుందని ఇన్ఫోసిస్‌ చెప్పింది.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Infosys, IT Employees

ఉత్తమ కథలు