ఇన్ఫోసిస్‌కు షాక్.. భారీ జరిమానా విధించిన కాలిఫోర్నియా

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అమెరికాలోని కాలిఫోర్నియా ప్రభుత్వానికి భారీ జరిమానా చెల్లించనుంది.

news18-telugu
Updated: December 18, 2019, 10:23 AM IST
ఇన్ఫోసిస్‌కు షాక్.. భారీ జరిమానా విధించిన కాలిఫోర్నియా
Infosys: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాక్... 12,200 మంది తొలగింపు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అమెరికాలోని కాలిఫోర్నియా ప్రభుత్వానికి భారీ జరిమానా చెల్లించనుంది. వీసా నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు దానికి సంబంధించిన పన్ను అవకతవకలకు పాల్పడినందుకు 8లక్షల డాలర్లు(రూ.565కోట్లు) జరిమానా విధించినట్టు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ తెలిపారు.

2006-2017వరకు దాదాపు 500 మంది ఉద్యోగులను ఇన్ఫోసిస్ హెచ్-1బి వీసాకు బదులు B-1 వీసాపై కాలిఫోర్నియాకు పంపించింది. తద్వారా అక్కడి వీసా నిబంధనలు ఉల్లంఘించినట్టయింది. హెచ్-1బి వీసాలపై పరిమితి ఉండటం, ఆ వీసాపై వచ్చే ఉద్యోగులకు అక్కడి ప్రమాణాల ప్రకారం వేతనం చెల్లించాల్సి ఉండటంతో ఇన్ఫోసిస్ B-1 వీసాపై ఉద్యోగులను అక్కడికి తరలించిందన్న ఆరోపణలున్నాయి. గతంలో సంస్థలో పనిచేసిన ఓ ఉద్యోగి దీనిపై అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపించారు. ఇన్ఫోసిస్ అవకతకవలు బయటపడటంతో ప్రభుత్వం విధించిన జరిమానా చెల్లించేందుకు సంస్థ ఒప్పుకుంది.
First published: December 18, 2019, 10:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading