ఇన్ఫోసిస్ క్యూ-3 ఫలితాలు... రూ. 4 డివిడెండ్‌తో షేర్ల బై బ్యాక్‌కు నిర్ణయం

ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ-3 ఫలితాలను ప్రకటించింది. మూడో త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో లాభాలను నమోదు చేయలేకపోయింది. ఒక్కో షేర్‌పై రూ. 4 డివిడెంట్ ప్రకటించిన ఇన్ఫోసిస్... రూ. 8260 కోట్ల ఖర్చుతో షేర్లను బై బ్యాక్ చేయాలని నిర్ణయించిన ఇన్ఫీ... ఒక్కో షేర్‌ను రూ. 800లకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

news18-telugu
Updated: January 11, 2019, 6:36 PM IST
ఇన్ఫోసిస్ క్యూ-3 ఫలితాలు... రూ. 4 డివిడెండ్‌తో షేర్ల బై బ్యాక్‌కు నిర్ణయం
ఇన్ఫోసిస్
news18-telugu
Updated: January 11, 2019, 6:36 PM IST
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ డివిడెండ్‌తో పాటు షేర్ల బైక్ బ్యాక్ ప్రకటించింది. ఒక్కో షేర్‌పై రూ. 4 డివిడెండ్‌ ప్రకటించిన ఇన్ఫోసిస్... రూ. 8260 కోట్ల ఖర్చుతో షేర్లను బై బ్యాక్ చేయాలని నిర్ణయించిన ఇన్ఫీ... ఒక్కో షేర్‌ను రూ. 800లకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ. 3609 నికర లాభాన్ని ప్రకటించిన కంపెనీ... మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. గతంతో పోలిస్తే 12 శాతం తక్కువ లాభాన్ని నమోదు చేసింది. టీసీఎస్ తరువాత మూడో త్రైమాసికం ఫలితాలు ప్రకటించిన ఇన్ఫోసిస్... సీఎన్‌బీసీ టీవీ 18 అంచనా వేసిన విధంగా రూ. 4, 114 కోట్ల లాభాల మార్కును చేరుకోలేకపోయింది.

అయితే మొత్తం ఆదాయం విషయంలో ఐటీ దిగ్గజం వృద్ధి సాధించింది. మొత్తంగా రూ. 21,400 కోట్లు ఆదాయం ఆర్జించి... 20.3% శాతం వృద్ధిని కనబరిచింది. ఇప్పటికే కంపెనీ వద్ద మిగులు నిధులు అధికంగా ఉండటంతో గతేడాది ఏప్రిల్లోనే రూ.13 వేల కోట్ల వరకు వాటాదారులకు పంచనున్నట్లు ప్రకటించింది. ఇదేక్రమంలో జూన్ నెలతో ముగిసిన 2018-19 తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసినప్పుడు ప్రకటించిన రూ.10 ప్రత్యేక డివిడెండ్ కోసం రూ.2,600 కోట్ల నిధులను వెచ్చించింది.

First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...