ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్‌కు క్లీన్ చిట్

విచారణలో భాగంగా సంస్థలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 77 మందిని విచారించింది. అలాగే సంస్థకు చెందిన సుమారు 2.1 లక్షల డాక్యుమెంట్లను పరిశీలించింది. అనంతరం అవకతవకలు జరగలేదనే ఏకాభిప్రాయం వచ్చాక నిర్ణయం ప్రకటించింది.

news18-telugu
Updated: January 11, 2020, 9:02 PM IST
ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్‌కు క్లీన్ చిట్
Infosys: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాక్... 12,200 మంది తొలగింపు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇన్ఫోసిస్ సంస్థ సీఈఓ సలీల్ పరేఖ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై సంస్థ ఆడిట్ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది. విచారణలో భాగంగా సంస్థలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 77 మందిని విచారించింది. అలాగే సంస్థకు చెందిన సుమారు 2.1 లక్షల డాక్యుమెంట్లను పరిశీలించింది. అనంతరం అవకతవకలు జరగలేదనే ఏకాభిప్రాయం వచ్చాక నిర్ణయం ప్రకటించింది. ఇదిలా ఉంటే సిఇఒ సలీస్ పరేఖ్‌పై వచ్చిన ఆరోపణలపై 2019 అక్టోబర్ నుంచి సంస్థ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో అవకతవకలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో సంస్థ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. కాగా సలీల్ సంస్థ లాభాల్లో ఉందని చూపించేందుకు, అనైతిక పద్ధతులు అవలంభించారని గతంలో విజిల్ బ్లోయర్లుగా ఉద్యోగులు ఆరోపించిన నేపథ్యంలో దుమారం చెలరేగింది.
First published: January 11, 2020, 9:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading