హోమ్ /వార్తలు /బిజినెస్ /

Loan: మహిళలకు శుభవార్త.. సులభంగానే రుణాలు, బ్యాంక్ కీలక నిర్ణయం!

Loan: మహిళలకు శుభవార్త.. సులభంగానే రుణాలు, బ్యాంక్ కీలక నిర్ణయం!

Loan: మహిళలకు శుభవార్త.. సులభంగానే రుణాలు, బ్యాంక్ కీలక నిర్ణయం!

Loan: మహిళలకు శుభవార్త.. సులభంగానే రుణాలు, బ్యాంక్ కీలక నిర్ణయం!

IndusInd Bank | దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ఇండ్ బ్యాంక్ తాజాగా ఎస్‌వీ క్రెడిట్ లైన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మహిళలకు రుణాలు లభించనున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

SV Credit Line | దిగ్గజ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ఇండ్ బ్యాంక్‌తో (Bank) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎస్‌వీ క్రెడిట్ లైన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎస్‌వీ క్రెడిట్ లైన్, ఇండస్ఇండ్ బ్యాంక్‌ మధ్య కోలెండింగ్ ఒప్పందం జరిగింది. రూ. 500 కోట్ల రుణాల జారీయే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా మహిళలకు ఊరట కలుగనుంది. ఎందుకంటే కేవలం మహిళలకు మాత్రమే రుణాలు (Loan) అందించనున్నాయి.

గ్రామీణ ప్రాంతాలలని మహిళలకు అధిక ప్రాధాన్యం లభిస్తుంది. వీరికి ఆఫర్డబుల్ లోన్స్ లభించనున్నాయి. అగ్రికల్చర్, పశుసంవర్ధక, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, వ్యాపారం ఇలా వివిధ విభాగాల్లో ఉన్న మహిళలకు రుణాలు అందించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక సాధికారత లక్ష్యంగా వారికి విరివిగా రుణాలు అందిస్తామని ఎస్‌వీ క్రెడిట్ లైన్ పేర్కొంది.

ఉచితంగా కొత్త క్రెడిట్ కార్డు.. క్షణాల్లో అకౌంట్‌లోకి డబ్బులు!

దేశంలోని అతిపెద్ద, మోస్ట్ పాపులర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఎస్‌వీ క్రెడిట్ లైన్ కూడా ఒకటి. ఇది 2010లో ఏర్పాటు అయ్యింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం పొందింది. తక్కువ ఆదాయం కలిగిన మహిళలకు ఈ సంస్థ రుణాలు అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1,25,000గా, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలుగా ఉన్న వారు రుణాలు పొందొచ్చు. దేశవ్యాప్తంగా 130 జిలాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది.

కొత్త స్కీమ్.. రూ.5 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు రుణం పొందండిలా!

ఈ సంస్థకు 5 లక్షలకు పైగా కస్టమర్లు ఉన్నారు. 227 బ్రాంచులను కలిగి ఉంది. 60 వేలకు పైగా టచ్ పాయింట్లు కలిగి ఉంది. 10 రాష్ట్రాల్లో సేవలు అందిస్తోంది. ఈ కంపెనీ ఎడిల్‌వీస్ ఫైనాన్స్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డీసీబీ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ వంటి వాటితోనూ భాగస్వామ్యం కలిగి ఉంది.

కాగా ఎస్‌వీ క్రెడిట్ లైన్, ఇండస్ ఇండ్ బ్యాంక్ భాగస్వామ్యం నేపథ్యంలో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు ధర 2.4 శాతం మేర పెరిగింది. రూ. 1193 వద్ద క్లోజ్ అయ్యింది. అలాగే షేరు వాల్యూమ్స్ కూడా పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే.. షేరు ధర ఏకంగా 30 శాతానికి పైగా ర్యాలీ చేసింది. అంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరులో డబ్బులు పెట్టిన వారి పంట పండిందని చెప్పుకోవచ్చు. కాగా కేవలం ఈ బ్యాంక్ స్టాక్ మాత్రమే కాకుండా ఇతర బ్యాంకుల షేర్లు కూడా పరుగులు పెడుతున్నాయి.

First published:

Tags: Banks, Money, Nbfc, Personal Loan

ఉత్తమ కథలు