హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Credit Cards: బ్యాంక్ శుభవార్త.. మార్కెట్‌లోకి కొత్త క్రెడిట్ కార్డులు, వారికి అదిరే బెనిఫిట్స్!

New Credit Cards: బ్యాంక్ శుభవార్త.. మార్కెట్‌లోకి కొత్త క్రెడిట్ కార్డులు, వారికి అదిరే బెనిఫిట్స్!

 New Credit Cards: బ్యాంక్ శుభవార్త.. మార్కెట్‌లోకి కొత్త క్రెడిట్ కార్డులు, వారికి అదిరే బెనిఫిట్స్!

New Credit Cards: బ్యాంక్ శుభవార్త.. మార్కెట్‌లోకి కొత్త క్రెడిట్ కార్డులు, వారికి అదిరే బెనిఫిట్స్!

IndusInd Credit Cards | ప్రైవేట్ రంగ ప్రముఖ బ్యాంక్ తాజాగా తీపికబురు అందించింది. కొత్త క్రెడిట్ కార్డులను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రధానంగా విమాన ప్రయాణం చేసే వారికి ప్రయోజనం కలుగుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Credit Cards | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ఇండ్ బ్యాంక్ తాజాగా తీపికబురు అందించింది. మార్కెట్‌లోకి కొత్త క్రెడిట్ కార్డులు (Credit Card) తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇవి కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులు. అంటే బ్యాంక్ (Bank) ఇతర సంస్థలతో కలిసి సంయుక్తంగా ఈ క్రెడిట్ కార్డులను ఆవిష్కరించబోతోంది. బ్రిటిష్ ఎయిర్‌వేస్, ఖతర్ ఎయిర్‌వేస్ వంటి ఎయిర్‌లైన్స్‌తో కలిసి కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తీసుకువస్తున్నట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ వెల్లడించింది. ఇవి రెండు విదేశీ ఎయిర్‌లైన్స్ కావడం గమనార్హం.

ఇండస్ఇండ్ బ్యాంక్ వీసా నెట్‌వర్క్‌పై ఈ కొత్త మల్టీ బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తీసుకురానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ కొత్త క్రెడిట్ కార్డులు మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నాయి. విమాన ప్రయాణం ఎక్కువగా చేసే వారికి ఈ కొత్త క్రెడిట్ కార్డుల వల్ల అధిక ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. మీట్ అండ్ గ్రీట్ సర్వీస్, టైర్ ఫాస్ట్ ట్రాక్ వంటి పలు రకాల ప్రయోజనాలు ఈ కార్డుల ద్వారా పొందొచ్చు.

పడిపోయిన బంగారం.. మళ్లీ పరుగులు పెట్టింది, నేటి రేట్లు ఇలా!

ఎయిర్ ట్రావెల్ మళ్లి కోవిడ్ మునపటి స్థాయికి చేరిందని, అందువల్ల ప్రయాణికులకు కూడా కొత్త ప్రాంతాలకు ట్రావెల్ చేస్తున్నారని వీసా హెడ్ ఆఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఫర్ ఇండియా సుజై రైనా తెలిపారు. తాము ఇతర సంస్తలతో కలిసి కస్టమర్లకు అధిక ప్రయోజనం కలిగే సర్వీసులు అందించడానికి ప్రయత్నిస్తామని వివరించారు. అందుకే ఇప్పుడు పలు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.

లక్ష్మీ కటాక్షం అంటే ఇదే.. రూ.1 షేరుతో రూ.50 లక్షల లాభం!

ఖతర్ ఎయిర్‌వేస్ ప్రివిలైజ్ క్లబ్ బెనిఫిట్, బ్రిటీష్ ఎయిర్‌వేస్ ఎగ్జిక్యూటివ్ క్లబ్ వంటి వాటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ కొత్త క్రెడిట్ కార్డులు ఇన్‌ఫినిటీ వేరియంట్ ఆఫ్ వీసా రూపంలో కస్టమర్లకు లభిస్తాయి. అంతర్జాతీయ విమాన ప్రయాణం చేసే ప్రయాణికులు ఈ కార్డుల ద్వారా బెస్ట్ ఇన్ క్లాస్ రివార్డులు పొందొచ్చు. ఇరత బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

ఖతర్ ఎయిర్‌వేస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ థియరీ యాంటినోరి మాట్లాడుతూ.. ఈరోజు ఖతర్ ఎయిర్‌వేస్ ప్రివిలేజ్ క్లబ్ మరో కీలక నిర్ణయం తీసుందని తెలిపారు. తమ కస్టమర్లకు మల్టీ బ్రాండ్ క్రెడిట్ కార్డు బెనిఫిట్స్ లభిస్తాయని పేర్కొన్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాగా ఇప్పటికే చాలా బ్యాంకులు ఇలా ఎయిర్‌లైన్స్‌తో కలిసి స్పెషల్ క్రెడిట్ కార్డులను మార్కెట్‌లోకి తీసుకువచ్చాయి. వీటి వల్ల ఇరు సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. అలాగే కస్టమర్లకు కూడా అధిక బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి.

First published:

Tags: Airlines, Bank, Bank news, Banks, Credit cards

ఉత్తమ కథలు