Home /News /business /

INDUSIND BANK LAUNCHES GREEN FIXED DEPOSITS CHECK FEATURES AND BENEFITS HERE MK

IndusInd Bank Green Fixed Deposits: మీ డబ్బుతో పుణ్యం, లాభం దక్కాలంటే ఇందులో ఇన్వెస్ట్ చేసి తీరాల్సిందే..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

IndusInd Bank launches Green Fixed Deposits : ఇండస్ ఇండ్ బ్యాంక్ (Indus Ind Bank)నుంచి సరికొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీం ఆవిష్కృతం అయ్యింది. ఈ స్కీమ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. దీని పేరు కూడా ప్రత్యేకమే అని చెప్పాలి. Green Fixed Deposits, గ్రీన్ ఫిక్స్ డ్ డిపాజిట్ల పేరిట మొదలు పెట్టిన ఈ పథకం ద్వారా సేకరించిన నిధులతో ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ కనబరచనున్నారు.

ఇంకా చదవండి ...
    IndusInd Bank launches Green Fixed Deposits : ఇండస్ ఇండ్ బ్యాంక్  (Indus Ind Bank)నుంచి సరికొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీం ఆవిష్కృతం అయ్యింది. ఈ స్కీమ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. దీని పేరు కూడా ప్రత్యేకమే అని చెప్పాలి. Green Fixed Deposits, గ్రీన్ ఫిక్స్ డ్ డిపాజిట్ల పేరిట మొదలు పెట్టిన ఈ పథకం ద్వారా సేకరించిన నిధులతో ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ కనబరచనున్నారు. అదే వీటిని ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (United Nations Sustainable Development Goals (SDGs)) కు అనుగుణంగా పరిశ్రమలకు ఆర్థిక సహాయం చేయనున్నారు. తద్వారా ఆయా పరిశ్రమలుు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు రేపటి తరానికి భవిష్యత్తును అందించే కార్యకలాపాల్లో వినియోగించనున్నారు. వీటి ద్వారా వచ్చిన వడ్డీతోనే గ్రీన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులకు లాభాలను పంచనున్నారు. అంటే మీకు పుణ్యంతో పాటు లాభం కూడా దక్కడం ఖాయం అన్నమాట.

    UPSC CDS 2022: నిరుద్యోగులకు అలర్ట్... 341 పోస్టులతో యూపీఎస్‌సీ నోటిఫికేషన్

    ఈ నిధులను సస్టెయినబుల్ డెవలప్మెంట్స్ గోల్స్ కు అనుగుణంగా పనిచేసే సంస్థలైన ​​పునరుత్పాదక శక్తి, గ్రీన్ రవాణా, స్థిరమైన ఆహారం, వ్యవసాయం, అటవీ, వ్యర్థాల నిర్వహణ, గ్రీన్‌హౌస్ వాయువులను తగ్గింపును ప్రోత్సహించే పరిశ్రమలకు రుణాలుగా ఇవ్వనున్నారు. వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రీన్ ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాదారులకు అందించనున్నారు. దీనికి సంబంధంచిన కార్యక్రమంలో ముంబైలో నిర్వహించారు. ఇందులో ఇండస్ ఇండ్ బ్యాంక్  (Indus Ind Bank) CSR హెడ్ రూప సతీష్ మాట్లాడుతూ ఇండస్ ఇండ్ బ్యాంక్  (Indus Ind Bank) సామాజిక బాధ్యతను గుర్తుచేసేలా ఈ పథకాలను తెచ్చినట్లు పేర్కొన్నారు. అంతేకాదు సుస్థిరమైన బ్యాంకింగ్ అనుభవానికి కూడా ఇండస్ ఇండ్ బ్యాంకు చిరునామాగా మారనుందని పేర్కొన్నారు. తమ బ్యాంకు దేశంలోనే band A కేటగిరీకి చెందిన బ్యాంకు అని దీని అర్థం తమ బ్యాంకు అతి తక్కువ కార్బన్ వ్యర్థాలను విడుదల చేసే వాటిలో ముందు వరుసలో నిలిచిందన్నారు. అంతేకాదు తమ బ్యాంకు గత 5 సంవత్సరాలుగా ఇదే ర్యాంకును మెయిన్ టెయిన్ చేస్తోందని పేర్కొన్నారు. ఇక ఈ తరహా ప్రకృతి అనుకూల ప్రాజెక్టులకు రుణ సదుపాయం అందించే బ్యాంకుగా ఇండస్ ఇండ్ నిలిచిందని ఆమె గుర్తు చేశారు. ఇదిలా ఉంటే ఈ గ్రీన్ ఫిక్స్ డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసే వారిలో సీనియర్ సిటిజన్లు ఉంటే వారికి ప్రత్యేకంగా 50 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ చెల్లించనున్నట్లు తెలిపారు. అంతేకాదు వారికి గ్రీన్ సర్టిఫికేట్లను సైతం అందజేయనున్నట్లు తెలిపారు. డిపాజిటర్లకు అష్యురెన్స్ సర్టిఫికేట్ సైతం అందించనున్నారు.

    Central Bank Jobs 2021: సెంట్రల్ బ్యాంకులో 214 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    >>    గ్రీన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సంవత్సరానికి 6 శాతం వరకు వడ్డీ

    >>    సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 0.50 శాతం అదనపు వడ్డీ

    >>    డిపాజిట్లపై రూ. 5 లక్షల వరకు బీమా మద్దతు ఉంది.

    >>    అతి తక్కువగా కేవలం 1 శాతం మాత్రమే ప్రీ-మెచ్యూర్ ఉపసంహరణ ఛార్జీలు
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Bank account, Fixed deposits

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు