Fixed Deposit | ప్రైవేట్ రంగ ప్రముఖ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఇండస్ఇండ్ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు ఊరట కలిగే ప్రకటన చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు (Money) దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కన్నా ఇకపై వీరికి అధిక రాబడి లభిస్తుంది. బ్యాంక్ రేట్ల పెంపు నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చింది. రూ. 2 కోట్లలోపు డిపాజిట్లకు ఈ రేట్ల పెంపు వర్తిస్తుంది.
ఇండస్ఇండ్ బ్యాంక్ ఇప్పుడు 7 రోజుల నుంచి 30 రోజుల ఎఫ్‌డీలపై 3.5 శాతం వడ్డీని అందిస్తోంది. అలాగే 31 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై అయితే 4 శాతం ఆఫర్ చేస్తోంది. ఇంకా 46 రోజుల నుంచి 60 రోజుల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 4.5 శాతంగా ఉంది. 61 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4.6 శాతంగా కొనసాగుతోంది. 91 రోజుల నుంచి 120 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే వడ్డీ రేటు 4.75 శాతం వడ్డీ రేటు ఉంది.
రూ.250 ఖర్చుతో నెలంతా తిరగొచ్చు.. ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది.. ధర తక్కువ రేంజ్ ఎక్కువ
121 రోజుల నుంచి 180 రోజులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 5 శాతం వడ్డీ సొంతం చేసుకోవచ్చు. 181 రోజుల నుంచి 210 రోజుల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 5.75 శాతంగా ఉంది. 211 రోజుల నుంచి 269 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 5.8 శాతంగా లభిస్తోంది. అలాగే 270 రోజుల నుంచి 354 రోజుల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 6 శాతంగా ఉంది. 355 రోజుల నుంచి 364 రోజుల ఎఫ్‌డీలపై 6.25 శాతం వడ్డీ పొందొచ్చు.
రూ.25 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ.6,500 కడితే ఇంటికి తెచ్చుకోవచ్చు!
ఏడాది నుంచి ఏడాది ఆరు నెలల టెన్యూర్‌పై 7.5 శాతం వడ్డీ ఉంది. ఏడాది ఆరు నెలల నుంచి మూడేళ్ల మూడు నెలలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7.75 శాతంగా లభిస్తోంది. అలాగే మూడేళ్ల 3 నెలల నుంచి 61 నెలల ఎఫ్‌డీలపై 7.25 శాతం, 61 నెలల నుంచి ఆపైన టెన్యూర్‌పై 7 శాతం వడ్డీ లభిస్తోంది. ఇండస్ ట్యాక్స్ సేవర్ స్కీమ్ (5 ఏళ్లు)పై వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంది. కాగా సీనియర్ సిటిజన్స్‌కు 8.25 శాతం వడ్డీ ఉంది. అందువల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారు ఈ బ్యాంక్ ఎఫ్‌డీలను ఒకసారి పరిశీలించొచ్చు. కాగా ఇప్పటికే చాలా బ్యాంకులు ఎఫ్‌డీ రేట్లు పెంచేశాయి. ఆర్‌బీఐ రెపో రేటు పెంపు ఇందుకు కారణం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Bank news, FD rates, Fixed deposits