హోమ్ /వార్తలు /బిజినెస్ /

Fixed Deposit: కస్టమర్లకు తీపికబురు అందించిన ప్రైవేట్ బ్యాంక్!

Fixed Deposit: కస్టమర్లకు తీపికబురు అందించిన ప్రైవేట్ బ్యాంక్!

 Fixed Deposit: కస్టమర్లకు తీపికబురు అందించిన ప్రైవేట్ బ్యాంక్!

Fixed Deposit: కస్టమర్లకు తీపికబురు అందించిన ప్రైవేట్ బ్యాంక్!

Bank FD Rates | మీరు బ్యాంక్‌లో డబ్బులు డిపాజిట్ చేసుకోవాలని చూస్తున్నారా? అయితే మీకు ప్రైవేట్ రంగ బ్యాంక్ తీపికబురు అందించింది. ఎఫ్‌డీ రేట్లు పెంచేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

FD Rates | మీరు బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే శుభవార్త. ఎందుకంటే తాజాగా ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ఇండ్ బ్యాంక్ (Bank) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లు పెంచేసింది. రూ. 2 కోట్ల లోపు ఎఫ్‌డీలకు రేట్ల పెంపు వర్తిస్తుంది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.

ఇండస్ఇండ్ బ్యాంక్ ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 6.5 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 7 రోజుల నుంచి 61 నెలల వరకు డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. రెగ్యులర్ కస్టమర్లకు ఈ రేట్లు వర్తిస్తాయి. అదే సీనియర్ సిటిజన్స్ అయితే 4 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీని పొందొచ్చు. 7 రోజుల నుంచి 30 రోజుల ఎఫ్‌డీలపై 3.5 శాతం వడ్డీని అందిస్తోంది. 31 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై 4 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. 46 రోజుల నుంచి 60 రోజుల ఎఫ్‌డీలపై అయితే 4.25 శాతం వడ్డీని పొందొచ్చు. 61 రోజుల నుంచి 120 రోజుల ఎఫ్‌డీలపై 4.5 శాతం వడ్డీ వస్తుంది.

కియా కార్లను ఇక తక్కువ ధరకే కొనొచ్చు.. కంపెనీ కొత్త సర్వీసులు!

130 రోజుల నుంచి 180 రోజుల ఎఫ్‌డీలపై 4.75 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. 181 రోజుల నుంచి 269 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 5.5 శాతం వడ్డీ ఉంది. 270 రోజుల నుంచి 354 రోజుల ఎఫ్‌డీలపై 5.75 శాతం, 355 రోజుల నుంచి 364 రోజుల ఎఫ్‌డీలపై 6 శాతం పొందొచ్చు. ఏడాది నుంచి ఏడాది ఆరు నెలల ఎఫ్‌డీలపై 6.75 శాతం వడ్డీ అందిస్తోంది.

పర్మనెంట్‌గా ఇక వారానికి 3 రోజులు సెలవులు, 4 రోజులే పని.. ఈ కంపెనీలన్నీ ఓకే!

అలాగే ఏడాది ఆరు నెలల నుంచి రెండేళ్లలోపు ఎఫ్‌డీలపై 7 శాతం వడ్డీ పొందొచ్చు. రెండేళ్ల నుంచి రెండేళ్ల ఒక నెల ఎఫ్‌డీలపై 7.25 శాతం వడ్డీ ఉంది. రెండేళ్ల ఒక నెల నుంచి మూడేళ్ల ఎఫ్‌డీలపై 7 శాతం వడ్డీ వస్తుంది. మూడేళ్ల నుంచి 61 నెలల ఎఫ్‌డీలపై 6.75 శాతం వడ్డీ పొందొచ్చు. 61 నెలలు, ఆపైన టెన్యూర్ అయితే 6.5 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలపై అయితే రెగ్యులర్ కస్టమర్లకు 6.75 శాతం వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు 7.25 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్స్‌కు 0.5 శాతం అధిక వడ్డీ లభిస్తుంది. కాగా ఇప్పటికే చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేశాయి. ఆర్‌బీఐ కీలక రెపో రేటు పెంపు ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.

First published:

Tags: Banks, FD rates, Fixed deposits

ఉత్తమ కథలు