Home /News /business /

INDUSIND BANK CREDITED LOANS WITHOUT CUSTOMER CONSENT DUE TECHNICAL ISSUE SS GH

Bank Loan: కస్టమర్లకు అడగకుండానే లోన్లు ఇచ్చిన బ్యాంకు... ఆ తర్వాత ఏం జరిగిందంటే

Bank Loan: కస్టమర్లు అడగకుండానే లోన్లు ఇచ్చిన బ్యాంకు... ఆ తర్వాత ఏం జరిగిందంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Bank Loan: కస్టమర్లు అడగకుండానే లోన్లు ఇచ్చిన బ్యాంకు... ఆ తర్వాత ఏం జరిగిందంటే (ప్రతీకాత్మక చిత్రం)

IndusInd Bank | ఇండస్‌ఇండ్ బ్యాంక్ సాంకేతిక తప్పిదంతో కస్టమర్ల అనుమతి లేకుండానే రుణాలు (Bank loans) మంజూరు చేసింది. ఈ విషయాన్ని బ్యాంకు స్వయంగా ఒప్పుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోండి.

రుణాల పంపిణీ విషయంతో తమ బ్యాంకులో సాంకేతిక తప్పిదం జరిగినట్లు ఇండస్ ఇండ్ బ్యాంక్ (IndusInd Bank) అంగీకరించింది. ఈ సాంకేతిక సమస్యల కారణంగా రుణగ్రహీతల సమ్మతి లేకుండానే ఈ ఏడాది మే నెలలో 84,000 రుణాలను (Bank Loans) మంజూరు చేసినట్లు బ్యాంక్‌ ప్రకటించింది. ఈ రుణాలను తమ అనుబంధ సంస్థ అయిన భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ లిమిటెడ్‌ మంజూరు చేసినట్లు వెల్లడించింది. అయితే ఎవర్ గ్రీనింగ్ ఆరోపణలను మాత్రం బ్యాంకు తాజాగా ఖండించింది. ఖాతాదారుల సమ్మతి లేకుండా పంపిణీ చేసిన రుణాలను ఫీల్డ్ సిబ్బంది రెండు రోజుల్లో గుర్తించి, దాన్ని వెంటనే సరిచేసినట్టు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.

SBI Alert: ఎస్‌బీఐ నుంచి ఫ్రీ గిఫ్ట్స్... క్యాష్‌బ్యాక్... మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?

ఎవర్ గ్రీనింగ్ అంటే రుణాలు నాన్ పర్ఫామింగ్ ఆస్తులుగా మారకుండా ఉండేందుకు ఖాతాలకు కొత్తరుణాలు మంజూరు చేయడం. ఎవర్ గ్రీన్ రుణాలపై ఇండస్ఇండ్ బ్యాంకు దాని అనుబంధ సంస్థ భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ లిమిటెడ్‌ సంస్థలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా లేఖ రాసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలను ఇండస్ఇండ్ బ్యాంకు ఖండించింది. కరోనా మహమ్మారి రెండు సార్లు వచ్చిన తరవాత బీఎఫ్ఐఎల్ ఇస్తోన్న రుణాలతోపాటు అన్ని రుణాలు సక్రమంగానే ఉన్నాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే 2021 మేలో సాంకేతిక లోపం కారణంగా ఖాతాదారుల అనుమతి లేకుండానే 84,000 రుణాలు పంపిణీ చేసినట్టు బ్యాంకు ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.

IRCTC Shri Ramayana Yatra: ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర ఎక్స్‌ప్రెస్ రైలు అదుర్స్ (Photos)

కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్లు, కంటైన్మెంట్ జోన్లు, ఆంక్షల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని రుణాలు నగదు రూపంలో పంపిణీ చేయాల్సి వచ్చిందని బ్యాంకు అధికారులు తెలిపారు.సెప్టెంబరు చివరి నాటికి 84,000 రుణ ఖాతాల్లో 26,000 మంది ఖాతాదారులు రూ.34 కోట్లు అవుట్‌ స్టాడింగ్ రుణాలతో యాక్టివ్ గా ఉన్నారు. మొత్తం రుణాల్లో ఇవి 0.12 శాతం మాత్రమేనని బ్యాంకు అధికారులు గుర్తుచేశారు.

బయోమెట్రిక్ అథరైజేషన్ తప్పనిసరి చేసి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ సవరించినట్టు బ్యాంకు తెలిపింది . కరోనాకు ముందు తరహాలోనే అక్టోబరు 2021లో నూరు శాతం రుణాలను ఖాతాదారుల ఖాతాల్లోనే జమ చేసినట్టు ఇండస్ఇండ్ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా కొందరు ఖాతాదారులు బ్యాంకు సేవలు పొందేందుకు అనేక ఇబ్బందులు పడ్డారని, కొందరు వేరే మార్గాలను ఎంచుకున్నారని బ్యాంకు ప్రకటించింది. అయితే ఎక్కువ మంది ఖాతాదారులు రుణాలు తిరిగి చెల్లించడం ద్వారా తమ బ్యాంకు పట్ల నమ్మకాన్ని ప్రదర్శించారని తెలిపింది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank, Bank loan, Bank loans, Banking

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు