• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • INDOSPACE PARTNERS WITH METL ANNOUNCED ACQUISITION OF 55 ACRES IN FARUKHNAGAR IN HARYANA AK

Indospace-METL: ఇండో స్పెస్ మరో భారీ ప్రాజెక్ట్.. ఎంఈటీఎల్‌తో జాయింట్ వెంచర్

Indospace-METL: ఇండో స్పెస్ మరో భారీ ప్రాజెక్ట్.. ఎంఈటీఎల్‌తో జాయింట్ వెంచర్

ప్రతీకాత్మక చిత్రం

Indospace-METL: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 39 ఇండిస్ట్రియల్ మరియు లాజిస్టిక్స్ పార్క్‌లో ‌41 మిలియన్ స్క్రేర్ ఫీట్ పోర్ట్‌ఫోలియోను ఇండోస్పెస్ కలిగి ఉంది.

  • Share this:
    ప్రముఖ ఇండస్ట్రీయల్ రియల్ ఎస్టేట్ అండ్ లాజిస్టిక్ పార్క్ డెవలపర్ ఇండో స్పెస్ హర్యానాలో ఫారుఖ్‌నగర్‌లో 55 ఎకరాలను సమీకరించినట్టు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ రిలయన్స్ గ్రూప్‌కు చెందిన మోడల్ ఎకనామిక్ టౌన్‌షిప్ లిమిటెడ్‌‌తో కలిసి జాయింట్ వెంచర్‌ అని వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని ఎనిమిది ఇండస్ట్రీయల్ పార్క్స్‌లో ఇండోప్పెస్ 480 ఎకరాలకు విస్తరించింది. గతంలోనూ ఎమ్ఈటీఎల్, ఇండోస్పెస్ మధ్య ఇలాంటి జాయింట్ వెంచర్ ఒప్పందాలు కుదిరాయి. 2017లో హర్యానా బాద్లిలోని ఎమ్ఈటీఎల్‌ నుంచి 120 ఎకరాలను ఇండోస్పెస్ సమీకరించింది.

    తాజా ఒప్పందంతో ఈ రెండు సంస్థల మధ్య ఉన్న బంధం మరింత బలపడింది. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని ఎమ్ఈటీఎల్ సీఈవో, శాశ్వత డైరెక్టర్ శ్రీవల్లభ్ గోయల్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచస్థాయి కంపెనీలను ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతానికి ఆకర్షించే మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 39 ఇండిస్ట్రియల్ మరియు లాజిస్టిక్స్ పార్క్‌లో ‌41 మిలియన్ స్క్రేర్ ఫీట్ పోర్ట్‌ఫోలియోను ఇండోస్పెస్ కలిగి ఉంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు