IndiGo Sale: 10 లక్షల సీట్లు... రూ.999 నుంచి టికెట్లు

IndiGo Summer Sale | ఇండిగో సమ్మర్ సేల్ ఆఫర్‌లో తక్కువ ధరకు టికెట్ కొనాలనుకునేవారు మే 16 లోగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మే 29 నుంచి సెప్టెంబర్ 28 మధ్య ప్రయాణించాలనుకునేవారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

news18-telugu
Updated: May 15, 2019, 1:31 PM IST
IndiGo Sale: 10 లక్షల సీట్లు... రూ.999 నుంచి టికెట్లు
IndiGo Sale: 10 లక్షల సీట్లు... రూ.999 నుంచి టికెట్లు (File Photo)
news18-telugu
Updated: May 15, 2019, 1:31 PM IST
సమ్మర్ వెకేషన్‌కు వెళ్లాలనుకునేవారికి శుభవార్త. మూడు రోజుల సమ్మర్ సేల్ ప్రకటించింది ఇండిగో ఎయిర్‌లైన్స్. 10 లక్షల సీట్లను తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. మే 29 నుంచి సెప్టెంబర్ 28 మధ్య ప్రయాణించాలనుకునేవారికి రూ.999 నుంచే టికెట్లను అమ్ముతోంది. డొమెస్టిక్‌తో పాటు ఇంటర్నేషనల్ రూట్లల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది. డొమెస్టిక్ రూట్స్‌లో రూ.999, ఇంటర్నేషనల్ రూట్స్‌లో రూ.3,499 నుంచి టికెట్ ధర మొదలవుతుంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు రూ.1899, బెంగళూరుకు రూ.2,799, భువనేశ్వర్‌కు రూ.2,499, చెన్నైకి రూ.3,099, గువాహతికి రూ.2,599, హైదరాబాద్‌కు రూ.2,500, కోల్‌కతాకు రూ.2,899, ముంబైకి రూ.2,499, పూణెకు రూ.2599 ధరకే టికెట్ కొనొచ్చు.


ఇండిగో సమ్మర్ సేల్ ఆఫర్‌లో తక్కువ ధరకు టికెట్ కొనాలనుకునేవారు మే 16 లోగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మే 29 నుంచి సెప్టెంబర్ 28 మధ్య ప్రయాణించాలనుకునేవారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కస్టమర్లు ఇండిగో వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో టికెట్ బుక్ చేయాలి. మొబీక్విక్, డిజీబ్యాంక్ డెబిట్ కార్డుతో టికెట్ బుక్ చేసేవారికి క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. డిజీబ్యాంక్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్, మొబీక్విక్ వ్యాలెట్‌పై రూ.1,000 క్యాష్ బ్యాక్ పొందొచ్చు.



OnePlus 7 Series: అదిరిపోయిన వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్
Loading...

ఇవి కూడా చదవండి:

Realme C2: ఎక్స్‌ఛేంజ్‌లో రూ.2,000 ధరకే రియల్‌మీ సీ2... కొందరికి మాత్రమే

SSY Scheme: రోజుకు రూ.100 పొదుపుతో రూ.16 లక్షల రిటర్న్స్...

WhatsApp Alert: వాట్సప్‌పై సైబర్ ఎటాక్... వెంటనే యాప్ అప్‌‌డేట్ చేయండి
First published: May 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...