INDIGO PAINTS SHARES AT RS 2607 WITH 76 PERCENT LISTING GAIN MK
Indigo Paints IPO : జస్ట్ ఒక్క నిమిషంలో లక్షకు 75 వేల లాభం అందించిన స్టాక్ ఇదే...ధన్ ధనా ధన్..
ప్రతీకాత్మకచిత్రం
దేశీయంగా అత్యంత వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్న పెయింట్ కంపెనీల్లో ఒకటైన ఇండిగో పెయింట్స్ షేర్ లు అలాట్ అయిన వారికి బంగారంగా మారిపోయాయి. దాదాపు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన షేర్ హోల్డర్లకు సుమారు 75 వేల వరకూ లాభం అందించాయి.
ఇండిగో పెయింట్స్ స్టాక్ ఈ రోజు స్టాక్ మార్కెట్లో 75 శాతం ప్రీమియంతో లిస్టింగ్ చేయబడింది. IPO ద్వారా స్టాక్ మార్కెట్లో రూ .1490 వద్ద ప్రైస్ బ్రాండ్ తో షేర్లను జారీ చేయగా. ఈ రోజు లిస్టింగ్ అయిన సమయంలో సుమారు రూ. 1111.50 లాభంతో బిఎస్ఇలో రూ .2607 వద్ద షేర్ లిస్ట్ అయ్యింది. ఇష్యూకు 117 రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ లభించింది. దీంతో ఇష్యూ ధర కంటే ఎంతో అధిక ధరకు షేర్లు లిస్ట్ కావటానికి అవకాశం ఏర్పడింది. దేశీయంగా అత్యంత వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్న పెయింట్ కంపెనీల్లో ఒకటైన ఇండిగో పెయింట్స్ షేర్ లు అలాట్ అయిన వారికి బంగారంగా మారిపోయాయి. దాదాపు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన షేర్ హోల్డర్లకు సుమారు 75 వేల వరకూ లాభం అందించాయి. అది కూడా కేవలం 1 నిమిషం వ్యవధిలోనే కావడం విశేషం. ఈ కంపెనీ రూ.1490 షేర్ ధరకు ఇటీవల ఐపీఓకు రావడంతో మంచి ఆదరణ లభించింది. బర్గర్ కింగ్ అనంతరం ఇండిగో పెయింట్స్ ధన్ ధనా ధన్ ఓపెనింగ్ ఇచ్చింది. ఇండిగో పెయింట్స్ ఐపిఓ జనవరి 20 న ప్రారంభమైంది. ఈ ఐపిఓలో 22 జనవరి 2021 వరకు పెట్టుబడులు పెట్టేలా ఓపెన్ అయ్యింది. ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,170 కోట్ల నిధులు సమీకరించింది. ఇందులో కొత్తగా జారీ చేసిన షేర్ల ద్వారా కంపెనీకి రూ 300 కోట్లు లభించగా, అఫర్ పర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రస్తుత షేర్హోలర్లకు రూ. 870 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు.
సంస్థ గురించి తెలుసుకోండి
దేశంలోని అగ్రశ్రేణి పెయింట్ కంపెనీలలో ఇండిగో పెయింట్స్ ఒకటి. ఈ సంస్థ తన పెయింట్స్‌ను ఇండిగో పేరుతో విక్రయిస్తుంది. కంపెనీ బ్రాండ్ ఈక్విటీ చాలా బలంగా ఉంది. సంస్థ పంపిణీ నెట్వర్క్ 27 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా లభించిన సొమ్మును ఈ కంపెనీ తమిళనాడులోని పుదుక్కొట్టాయ్లో ఉన్న పెయింట్ల తయారీ యూనిట్ సామర్థ్యాన్ని విస్తరించటానికి వెచ్చిస్తుంది. గత ఏడాది కాలంగా కొవిడ్-10 తో అన్ని రకాలైన వ్యాపారాలు కుంగిపోగా, ఇండిగో పెయింట్స్ పై మాత్రం ఎటువంటి ప్రభావం పడలేదు. చిన్న, మధ్యతరహా పట్టణాల్లో విస్తృతమైన రీతిలో డీలర్లు ఉండటం, పెయింట్ల వినియోగం తగ్గకపోవటం దీనికి ప్రధాన కారణం.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.