news18-telugu
Updated: February 11, 2020, 5:02 PM IST
Valentines Day offer: వాలెంటైన్స్ డే స్పెషల్... ఇండిగో ఫ్లైట్ టికెట్ రూ.999 మాత్రమే
(image: Indigo Airlines)
ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ వాలెంటైన్స్ డే సందర్భంగా అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఫ్లైట్ టికెట్లను రూ.999 ధరకే ప్రకటించింది. వాలెంటైన్స్ డే స్పెషల్ ఇండిగో ఎయిర్‌లైన్స్ సేల్ ఫిబ్రవరి 11న ప్రారంభమైంది. వాలెంటైన్స్ డే రోజైన ఫిబ్రవరి 14న ఈ సేల్ ముగుస్తుంది. మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించాలనుకునేవారు ఫిబ్రవరి 11 నుంచి 14 మధ్య నాలుగు రోజులపాటు రూ.999 ధర నుంచి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆఫర్ ధర రూ.999 నుంచి మొదలవుతుంది. ఆఫర్ సేల్ కోసం 10 లక్షల సీట్లను కేటాయించింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నుంచి ఈఎంఐ పేమెంట్స్ చేస్తే రూ.5,000 వరకు 12% క్యాష్‌బ్యాక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేజ్ యాప్‌తో టికెట్లు బుక్ చేస్తే రూ.1000 వరకు 15% క్యాష్‌బ్యాక్, ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డుతో పేమెంట్ చేస్తే రూ.1500 వరకు 10% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
కార్పొరేట్ కస్టమర్లతో పాటు విహారయాత్రలకు వెళ్లే ప్రయాణికులు ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఇండిగో ప్రకటించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్లైట్ టికెట్ ఆఫర్ ధర రూ.999 నుంచి మొదలవుతున్నా... హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి వెళ్లే ఇండిగో ఫ్లైట్లలో రూ.999 ధరకు టికెట్లు అందుబాటులో లేవు. హైదరాబాద్ నుంచి కనీస టికెట్ ధర రూ.1599. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లేందుకు తక్కువ ధరలో అందుబాటులో ఉన్న టికెట్ ఇదే. ఇక ఈ సేల్‌లో హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ఫ్లైట్ టికెట్లు ఎంతలో ఉన్నాయో తెలుసుకోండి.
రూ.1599- హైదరాబాద్ నుంచి చెన్నై
రూ.1699- హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్, బెంగళూరు
రూ.1799- హైదరాబాద్ నుంచి ముంబై
రూ.1999- హైదరాబాద్ నుంచి విజయవాడ, గోవా, అహ్మదాబాద్
రూ.2099- హైదరాబాద్ నుంచి సూరత్రూ.2399- హైదరాబాద్ నుంచి తిరుపతి
ఇవి కూడా చదవండి:
Valentines Day Gifts: ప్రేమికుల రోజు ఇవ్వడానికి రూ.1,000 లోపు 12 బెస్ట్ గిఫ్ట్స్ ఇవే
WhatsApp: మీ వాట్సప్ సేఫ్‌గా ఉండాలంటే ఈ సెట్టింగ్స్ మార్చండి
Smartphone Tips: మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా? ఈ టెక్నిక్స్‌తో ఎక్కడుందో తెలుసుకోవచ్చు
Published by:
Santhosh Kumar S
First published:
February 11, 2020, 5:01 PM IST