విమానంలో బొద్దింక... రూ.50,000 ఫైన్

Indigo Airlines : లగ్జరీ ప్రయాణాలకు పెట్టిందిపేరు విమానాలు. మరి అలాంటి ఓ విమానంలో వింత జీవి కనిపిస్తే... కలకలం రేగకుండా ఉంటుందా? ఏం జరిగిందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: January 4, 2020, 6:33 AM IST
విమానంలో బొద్దింక... రూ.50,000 ఫైన్
విమానంలో బొద్దింక (credit - twitter - Manimaran G V)
  • Share this:
Indigo Airlines : అది డిసెంబర్ 31, 2018. స్కంద్ అసీమ్ వాజ్‌పాయ్, సురభి రాజీవ్ భరద్వాజ్... ఢిల్లీ నుంచీ పుణె వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కారు. విమానం బయల్దేరింది. మేఘాల పైనుంచీ విమానం వెళ్తోంది. ఆ సీనరీ చూసేందుకు చాలా బాగుంది. ఇంతలో ఇద్దరు ప్రయాణికుల్లో ఒకరికి... ఏదో వింత జీవి... సీటు కిందకు వెళ్లడం కనిపించింది. అదేంటి? ఏదో వెళ్లింది అన్నాడు. వాట్ హ్యాపెండ్... అంటూ మరో ప్రయాణికుడు కూడా అలర్ట్ అయ్యాడు. సీటు కిందకు వెళ్లిన జీవి ఏంటా అని అప్పటికప్పుడు చెక్ చేశారు. అది బొద్దింక అని అర్థమైంది. వెంటనే సిబ్బందిని పిలిచి... సీటు కింద బొద్దింక ఉందని చెప్పారు. దాన్ని తొలగించమని కోరారు. సిబ్బంది చూస్తే... అక్కడ బొద్దింక కనిపించలేదు. అది ఎటో వెళ్లిపోయింది. దాంతో సిబ్బంది... వెళ్లిపోయిందిగా... డోంట్ వర్రీ అనేశారు. అలా ఎలా అంటారు. బొద్దింకల వల్ల కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దాన్ని కనిపెట్టి... యాక్షన్ తీసుకోండి. అంటే... అది దొరకదు. కావాలంటే మేం ఏమీ చెయ్యలేదని కంప్లైంట్ ఇచ్చుకోండి... అని సిబ్బంది వెళ్లిపోయారు. ఒళ్లు మండిన ప్రయాణికులు... ఢిల్లీలో విమానం దిగాక... అక్కడి ఇండిగో ఆఫీస్‌లో కంప్లైంట్ ఇచ్చారు. బొద్దింకను తీసిన ఫొటోల్ని చూపించారు. ఆ ఆఫీస్ ఉద్యోగులు కూడా... ఈ రోజుల్లో బొద్దింకలు కామన్. మన ఇళ్లలో ఉంటాయిగా సార్... అలాగే విమానంలోనూ వచ్చి ఉంటాయి. లైట్ తీసుకోండి. అన్నారు.

ఇక లాభం లేదనుకున్న ప్రయాణికులు... పుణె డిస్ట్రిక్ట్ వినియోగదారుల కోర్టుకు వెళ్లారు. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కోర్టు... ఇండిగో అధికారులకు నోటీస్ పంపింది. వాళ్లు కోర్టుకు రాలేదు. దాంతో ఇండిగో... ఆ ఇద్దరు ప్రయాణికులకూ... టికెట్ ఛార్జీ రూ.8574ని తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. అలాగే... 2018 డిసెంబర్ 31 నుంచీ ఇప్పటి వరకూ టికెట్ ఛార్జీలపై వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు... కోర్టు ఖర్చులు, పరిహారం కింద రూ.50,000 ఇవ్వాలని ఆదేశించింది. ఇలా బొద్దింకపై పోరాటంలో ఆ ఇద్దరు ప్రయాణికులూ విజయం సాధించారు.
Published by: Krishna Kumar N
First published: January 4, 2020, 6:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading