• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • INDIGO AIRLINES OFFERS 10 PERCENT DISCOUNT TO PASSENGERS FOR WHO GET VACCINE SS GH

IndiGo Airlines: వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులకు 10 శాతం డిస్కౌంట్

IndiGo Airlines: వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులకు 10 శాతం డిస్కౌంట్ (ప్రతీకాత్మక చిత్రం)

IndiGo Airlines | విమాన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్‌లైన్స్ శుభవార్త చెప్పింది. వ్యాక్సిన్ తీసుకున్నవారికి డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.

  • Share this:
ప్రస్తుతం కరోనా కట్టడికి మన ముందు ఉన్న ఏకైక మార్గం పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ ఒక్కటే. దీన్ని గుర్తించిన చాలా దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ డ్రైవ్‌ను వేగవంతం చేసేందుకు వివిధ దేశాల్లో అధికారులు కొత్త ప్రణాళికలు వేస్తున్నారు. అమెరికాలో టీకా తీసుకుంటే బీర్లు ఫ్రీగా ఇస్తామని కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి. ఇండోనేషియాలో వ్యాక్సిన్ తీసుకున్న వారికి కోళ్లను బహుమతిగా ఇస్తున్నారు. తాజాగా ఈ పోకడ మన దేశానికి కూడా వ్యాపించింది. టీకాలు తీసుకున్న వారికి ప్రయాణాల్లో పది శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్. కోవిడ్ టీకాలు తీసుకున్న వినియోగదారులకు బేస్ ఛార్జీలపై 10 శాతం వరకు తగ్గింపు ఉంటుందని జూన్ 23న ప్రకటించింది.

వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు తోడ్పాటు అందివ్వడం బాధ్యతగా భావిస్తున్నామని ఇండిగో తెలిపింది. ఎక్కువ మంది ప్రజలకు టీకాలు ఇచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించింది. మార్కెట్ వాటా పరంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థగా గుర్తింపు ఉంది. దీంతోపాటు భారత్‌లో వినియోగదారుల కోసం ఇలాంటి ఆఫర్‌ను ప్రకటించిన మొదటి విమానయాన సంస్థగా ఇండిగో నిలిచింది.

Vi Prepaid Plan: వొడాఫోన్​ నుంచి రూ.447 ప్రీపెయిడ్​ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

PAN Aadhaar Linking: పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఈ 7 నష్టాలు తప్పవు

ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది?


18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ప్రయాణికులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. బుకింగ్ సమయంలో భారత్‌లో ఉండి, దేశంలో అందిస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది. బుకింగ్ సమయంలో ఆఫర్ పొందిన ప్రయాణికులు.. విమానాశ్రయం చెక్-ఇన్ బోర్డింగ్ కౌంటర్ లేదా బోర్డింగ్ గేట్ వద్ద భారత ప్రభుత్వం జారీ చేసిన వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఆరోగ్య సేతు యాప్‌లో వ్యాక్సినేషన్ స్టేటస్‌ను కూడా వినియోగదారులు బోర్డింగ్ గేట్ వద్ద చూపించవచ్చు. ఒక్క డోసు టీకా తీసుకున్న వారు కూడా ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు.

Cardless EMI: ఇక క్రెడిట్ కార్డ్ అవసరం లేదు... 'కార్డ్‌లెస్ ఈఎంఐ' మీకోసమే

IRCTC Tirupathi Tour: ఐఆర్‌సీటీసీ తిరుమల ప్యాకేజీ రూ.990 మాత్రమే... శ్రీవారి దర్శనం కూడా

కరోనా నేపథ్యంలో విమాన ప్రయాణాలకు సంబంధించి పౌర విమానయాన శాఖ జూన్ 1న మార్గదర్శకాలు విడుదల చేసింది. విమానాల్లో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతానికి పరిమితం చేసింది. దేశీయ విమానయాన సంస్థలు వసూలు చేయాల్సిన ఛార్జీలపై గతంలో ఉన్న పరిమితులను కొంత మేరకు సడలించింది. ఈ నేపథ్యంలో ఇండిగో కొత్త ఆఫర్‌తో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

వ్యాక్సిన్ తీసుకున్న వారికి విమానయాన సంస్థలు ఆఫర్లను ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. యూరోపియన్ దేశాలు వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రోత్సహించడానికి విమానయాన సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే భారత్‌లో ఈ ఆఫర్ ప్రకటించిన మొదటి సంస్థగా ఇండిగో ఎయిర్‌లైన్స్ నిలిచింది. ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తున్న నేపథ్యంలో.. మరికొన్ని సంస్థలు సైతం ఇలాంటి ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Published by:Santhosh Kumar S
First published: