news18-telugu
Updated: December 24, 2019, 12:51 PM IST
IndiGo offer: రైలు టికెట్ దొరకలేదా? ఫ్లైట్ టికెట్ రూ.899 మాత్రమే
(image: Indigo)
సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా? సెలవుల్లో ఊరెళ్లేందుకు రైలు టికెట్లు బుక్ చేశారా? మీకు రైలు టికెట్లు దొరకలేదని ఫీల్ అవుతున్నారా? మీకు శుభవార్త. రైలు టికెట్లు దొరక్కపోతే తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 'ది బిగ్ ఫ్యాట్ ఇండిగో సేల్' ప్రారంభించింది ఇండిగో ఎయిర్‌లైన్స్. రూ.899 ధరకే డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్లను అందిస్తోంది. రూ.2999 ధరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. డిసెంబర్ 23న ప్రారంభమైన సేల్ నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. డిసెంబర్ 26 వరకు టికెట్ బుక్ చేసుకోవచ్చు. 2020 జనవరి 15 నుంచి 2020 ఏప్రిల్ 15 మధ్య ప్రయాణించేవారికి మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్స్ వర్తిస్తాయి.
డొమెస్టిక్ టికెట్లు రూ.899 నుంచి, ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్లు రూ.2999 నుంచి మాత్రమే కాదు... కన్వీనెన్స్ ఫీజు కూడా తొలగించింది ఇండిగో. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌పై 15%, ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డుపై 15%, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.2000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఫ్లైట్ టికెట్లను ఇండిగో వెబ్సైట్, మొబైల్ యాప్‌లో బుక్ చేయొచ్చు. అయితే ఎన్ని సీట్లపై ఆఫర్ సేల్ నడుస్తుందో ఇండిగో ప్రకటించలేదు.
Redmi K20 Pro: తక్కువ ధర, అదిరిపోయిన ఫీచర్స్... రెడ్మీ కే20, రెడ్మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
EPF Withdrawal: మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయండి ఇలా
Sukanya Samriddhi Rules 2019: సుకన్య సమృద్ధి యోజన రూల్స్ ప్రకటించిన ప్రభుత్వం
IRCTC: సంక్రాంతికి రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు
Published by:
Santhosh Kumar S
First published:
December 24, 2019, 12:51 PM IST