హోమ్ /వార్తలు /బిజినెస్ /

Indigo Airlines: ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఉద్యోగుల షాక్.. అనారోగ్యం అంటూ సెలవు పెట్టి అలా..

Indigo Airlines: ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఉద్యోగుల షాక్.. అనారోగ్యం అంటూ సెలవు పెట్టి అలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Indigo: ఏప్రిల్ 4న ఇండిగో CEO రోంజోయ్ దత్తా ఏప్రిల్ 8న ఉద్యోగులకు ఒక ఇమెయిల్ ద్వారా వేతనాలు పెంచడం చాలా కష్టమైన సమస్య అని తేల్చి చెప్పారు.

విమానయాన సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అసలే ఇబ్బందుల్లో ఉన్న ఈ సంస్థలకు కరోనా మరింత కష్టాలు తెచ్చిపెట్టింది. అయితే ఎయిర్ ఇండియాను(Air India) టాటా కంపెనీ(Tata Company) కొనుగోలు చేసిన తరువాత.. ఆ కంపెనీలో పని చేయడానికి ఉద్యోగులు కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఎయిర్ ఇండియాలో పని చేసేందుకు ఇతర కంపెనీల్లోని ఉద్యోగులు ఆసక్తి చూపడం.. ఏకంగా మరో సంస్థ విమాన సర్వీసులకు అంతరాయం కలిగించేలా చేసింది. పెద్ద సంఖ్యలో సిబ్బంది అనారోగ్యం పేరుతో సెలవు తీసుకోవడంతో విమానయాన సంస్థ ఇండిగో(Indigo) యొక్క 55 శాతం దేశీయ విమానాలు శనివారం ఆలస్యమయ్యాయి. ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో చేరేందుకు సిబ్బంది ఇలా సెలవుపై వెళ్లారని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై ఏవియేషన్ రెగ్యులేటర్ డిజిసిఎ చీఫ్ అరుణ్ కుమార్‌ స్పందించారు.

ఈ విషయాన్ని తాము పరిశీలిస్తున్నామని అరుణ్ కుమార్ అన్నారు. ఇక ఎయిర్ ఇండియా రెండో దశ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను శనివారం నిర్వహించామని, సిక్ లీవ్ తీసుకున్న ఇండిగో సిబ్బంది దీనికి వెళ్లారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇండిగో ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా రోజుకు దాదాపు 1,600 విమానాలను నడుపుతోంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. ఇండిగో దేశీయ విమానాలలో 45.2 శాతం శనివారం సమయానికి నడిచాయి.

శనివారం నాడు ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, విస్తారా, గోఫస్ట్, ఎయిర్‌ఏషియా ఇండియా విమానాలు వరుసగా 77.1 శాతం, 80.4 శాతం, 86.3 శాతం, 88 శాతం, 92.3 శాతం విమానాలు సకాలంలో నడిచాయి. ఏప్రిల్ 4న ఇండిగో CEO రోంజోయ్ దత్తా ఏప్రిల్ 8న ఉద్యోగులకు ఒక ఇమెయిల్ ద్వారా వేతనాలు పెంచడం చాలా కష్టమైన సమస్య అని తేల్చి చెప్పారు. అయితే ఎయిర్‌లైన్ దాని లాభదాయకత, పోటీ వాతావరణం ఆధారంగా జీతాలను నిరంతరం సమీక్షిస్తుంది. ఆ రకంగా సర్దుబాటు చేస్తుంది.

మానవత్వం అంటే మనుషులకేనా... ఏనుగు చేసిన పనికి శభాష్ అంటున్న నెటిజన్లు..

MK Stalin : నియంతలా మారి వాళ్ల అంతు చూస్తా..సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్

గత ఏడాది అక్టోబర్ 8న ఎయిర్‌లైన్ కోసం బిడ్‌ను విజయవంతంగా గెలుచుకున్న తర్వాత.. జనవరి 27న టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా నియంత్రణను చేపట్టింది. ఎయిర్ ఇండియా కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసి దాని సేవలను మెరుగుపరచాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల సిబ్బంది కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. దీంతో ఇతర సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఎయిర్ ఇండియా వైపు చూస్తున్నారు.

First published:

Tags: Air India, IndiGo

ఉత్తమ కథలు