కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇన్నాళ్లూ టూర్లు వాయిదా వేసుకున్నారా? మీ ప్రయాణాలన్నీ వాయిదా పడ్డాయా? వచ్చే నెలలో ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నారా? ఇండిగో ఎయిర్‌లైన్స్ అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించింది. కేవలం రూ.915 ధర నుంచే ఫ్లైట్ టికెట్లను ఆఫర్ చేస్తోంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రూట్లలో డిస్కౌంట్ ధరలకే ఫ్లైట్ టికెట్లను అందిస్తోంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రారంభించి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆఫర్స్ అందిస్తోంది. ఆగస్ట్ 4 నుంచి 6 వరకు డిస్కౌంట్ ధరలకే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 2021 సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చి 26 మధ్య ప్రయాణించాలని అనుకునేవారు డిస్కౌంట్ ధరలకే ఫ్లైట్ టికెట్లను బుక్ చేయొచ్చు.
ఇండిగో ఎయిర్‌లైన్స్ తక్కువ సీట్లనే ఆఫర్ ధరకు అందిస్తోంది. రూ.915 ధర నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలనుకునే ప్రయాణికులు వీలైనంత త్వరగా బుకింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఫాస్ట్ ఫార్వర్డ్, 6ఈ ఫ్లెక్స్, 6ఈ బ్యాగ్‌పోర్ట్, కార్ రెంటల్ సర్వీస్‌ను రూ.315 ధరకే పొందొచ్చు. హెచ్‌ఎస్‌సీబీఎస్ క్రెడిట్ కార్డ్ ఓనర్లకు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కనీసం రూ.3,000 లావాదేవీలపై గరిష్టంగా రూ.750 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
ఇండిగో ఎయిర్‌లైన్స్ రూ.915 ధర నుంచి ఫ్లైట్ టికెట్స్ అమ్ముతున్నట్టు ప్రకటించినా హైదరాబాద్ నుంచి వెళ్లే ఫ్లైట్లకు టికెట్ ధరలు రూ. 1415 నుంచి ప్రారంభం అవుతాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రూ.1415, చెన్నైకి రూ.1715, తిరుపతికి రూ.1815, ముంబై, ఢిల్లీ, గోవాకు రూ.1915, విశాఖపట్నం, విజయవాడకు రూ.2115 చొప్పున టికెట్ ధరలున్నాయి. ఇక విశాఖపట్నం నుంచి రాజమండ్రికి రూ.1215, హైదరాబాద్, చెన్నైకి రూ.2115, బెంగళూరుకు రూ.2315 చొప్పున ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి.
ఇక విజయవాడ నుంచి తిరుపతికి రూ.1815, హైదరాబాద్‌కు రూ.2015, చెన్నైకి రూ.2315, బెంగళూరుకు రూ.2815 చొప్పున ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి. ఇక తిరుపతి నుంచి హైదరాబాద్‌కు రూ.1515, విజయవాడకు రూ.1815, బెంగళూరుకు రూ.2015, రాజమండ్రికి రూ.2215 చొప్పున ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఆఫర్‌లో అందిస్తున్న టికెట్ ధరల వివరాలు https://www.goindigo.in/sale.html వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.