హోమ్ /వార్తలు /బిజినెస్ /

Airline offers: రూ.900 లోపే ఫ్లైట్ టికెట్... ఆఫర్స్ ప్రకటించిన ఇండిగో, స్పైస్‌జెట్

Airline offers: రూ.900 లోపే ఫ్లైట్ టికెట్... ఆఫర్స్ ప్రకటించిన ఇండిగో, స్పైస్‌జెట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Airline offers | మీరు ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఫ్లైట్‌లో జర్నీ చేయాలనుకుంటున్నారా? ఇండిగో, స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ ఆఫర్స్ ప్రకటించాయి. రూ.900 లోపే ఫ్లైట్ టికెట్స్‌ని అందిస్తున్నాయి.

స్పైస్‌జెట్ 5 రోజుల 'బుక్ బేఫికర్ సేల్' కొనసాగుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ సేల్ జనవరి 17 అర్థరాత్రి వరకు ఉంటుంది. 2021 ఏప్రిల్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించాలనుకునేవారు రూ.899 ధరకే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్-బెళగావి, బెళగావి-హైదరాబాద్, జమ్మూ-శ్రీనగర్, శ్రీనగర్-జమ్మూ, బెంగళూరు-చెన్నై, చెన్నై-బెంగళూరు, అహ్మదాబాద్-జైసల్మేర్, జైసల్మేర్-అహ్మదాబాద్ లాంటి రూట్స్‌లో రూ.899 ధరకే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ వివరాలన్నీ https://www.spicejet.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

ఇక స్పెషల్ ఆఫర్‌లో భాగంగా కాంప్లిమెంటరీ ఫ్లైట్ వోచర్‌ను కూడా అందిస్తోంది స్పైస్‌జెట్. ప్రతీ ప్రయాణికుడికి రూ.1,000 వోచర్‌ను అందిస్తుంది. ఈ ఫ్లైట్ వోచర్‌ను 2021 ఫిబ్రవరి 28 లోగా ఉపయోగించుకోవచ్చు. 2021 ఏప్రిల్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 30 మధ్య బుక్ చేసుకునే ఫ్లైట్లకు రూ.1,000 వోచర్ వర్తిస్తుంది. ఇక వీటితో పాటు ఫ్లైట్ ఛేంజ్, క్యాన్సలేషన్‌ ఛార్జీలను ఒకరాసి మినహాయిస్తోంది. కాబట్టి ప్రయాణికులు తమ టికెట్లను ఎలాంటి ఛార్జీలు లేకుండా మాడిఫై చేయొచ్చు లేదా క్యాన్సిల్ చేయొచ్చు. అయితే ఫ్లైట్ డిపార్చర్ తేదీ కన్నా 21 రోజుల ముందే మాడిఫై లేదా క్యాన్సల్ వర్తిస్తుంది. వీటితో పాటు రూ.149 ధరకు ప్రిఫర్డ్ బోర్డింగ్, బ్యాగ్ ఔట్ సర్వీస్, రూ.249 ధరకు మీల్స్, రూ.799 ధరకు స్పైస్‌మ్యాక్స్ అప్‌గ్రేడ్ పొందొచ్చు.

Tata Safari 2021: కొత్త టాటా సఫారీ వచ్చేసింది... ఎలా ఉందంటే (Photos)

Gold: ఈ బంగారం కొంటే వడ్డీ కూడా వస్తుంది... కొనడానికి ఈరోజే చివరి తేదీ

ఇక ఇండిగో ఎయిర్‌లైన్స్ 'ది బిగ్ ఫ్యాట్ ఇండిగో సేల్' ప్రకటించింది. తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్లను అందిస్తోంది. రూ.877 ధరకే ఫ్లైట్ టికెట్లు బుక్ చేయొచ్చు. సేల్ జనవరి 13న ప్రారంభమైంది. జనవరి 17 వరకు సేల్ కొనసాగుతుంది. 2021 ఏప్రిల్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించేవారు రూ.877 ధరకే టికెట్లు బుక్ చేయొచ్చు. ఫ్లైట్ ఛేంజ్, క్యాన్సలేషన్ ఛార్జీలు రూ.500 అని ప్రకటించింది ఇండిగో ఎయిర్‌లైన్స్. హెచ్ఎస్‌బీసీ, ఇండస్‌ఇండ్ క్రెడిట్ కార్డులపై అదనంగా క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి.

Jio 28 days plans: 28 రోజుల వేలిడిటీ కావాలా? జియో అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ ఇవే...

Paytm Instant Personal Loan: పేటీఎం యూజర్లకు అదిరిపోయే ఆఫర్... 2 నిమిషాల్లో రూ.2,00,000 లోన్

ముందు బుక్ చేసినవారికే ఈ ఫ్లైట్ టికెట్స్ లభించే అవకాశాలు ఎక్కువ. టికెట్ ధర తక్కువ కాబట్టి పోటీ ఎక్కువగా ఉంటుంది.

First published:

Tags: Airlines, IndiGo, SpiceJet

ఉత్తమ కథలు