Stock Market Crash: ముడి చమురు ధరల పతనం అలాగే కరోనావైరస్ భయాలు సోమవారం మార్కెట్లలో అల్లకల్లోలం సృష్టించాయి. సోమవారం మార్కెట్లో మదుపరులు భారీగా అమ్మకాలకు దిగడంతో బెంచ్ మార్క్ ఇండెక్స్ లు సెన్సెక్స్ , నిఫ్టీ ఇంట్రా-డే సెషన్లో 6 శాతానికి పైగా పడిపోయాయి. అతిపెద్ద ఇంట్రడే పతనం నమోదు కావడంతో దాదాపు రూ.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి బిఎస్ఇ సెన్సెక్స్ 1,942 పాయింట్లతో 5 శాతానికి పైగా నష్టపోయి 35,635 పాయింగ్ల వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఏకంగా 14 శాతం క్షీణించి 52 వారాల కనిష్టానికి 1,094.95 రూపాయలకు చేరుకుంది. ఇండెక్స్ పరంగా భారీ స్టాక్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ పతనం కూడా సూచీల్లో భారీ పతనానికి దోహదపడింది. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, టిసిఎస్, ఇన్ఫోసిస్ మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ భారీ అమ్మకాలను చవిచూశాయి.
ఎన్ఎస్ఇలో, నిఫ్టీ 50 సూచీ 10,500 మార్క్ కంటే పడిపోయి 546 పాయింట్లతో 5 శాతం నష్టపోయి 10,443 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇలోని అన్ని సెక్టార్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఏకంగా 8 శాతం క్షీణించింది.
మరోవైపు ప్రపంచ చమురు డిమాండ్‌పై కరోనావైరస్ ప్రభావం చూపుతోంది. సౌదీ అరేబియా చమురు ధరలను తగ్గించిన తరువాత, వాటి విలువలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ కోల్పోయింది. సోమవారం చమురు ధరల పతనం మొదటి గల్ఫ్ యుద్ధం తరువాత అతిపెద్ద రోజువారీ పతనంగా నమోదైంది. బ్రెంట్ ముడి ఫ్యూచర్స్ 11.38 డాలర్లు 25 శాతం తగ్గి 33.89 డాలర్లకు చేరుకుంది. ఫిబ్రవరి 12, 2016 నుండి ఇదే కనిష్ట స్థాయి కావడం గమనార్హం.
ఇక యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) ముడి బ్యారెల్ ధర 11.12 డాలర్లు తగ్గి 30.16 డాలర్లకు పడిపోయింది, ఫిబ్రవరి 12, 2016 నాటి కనిష్ట స్థాయికి చేరుకుంది. రికార్డు స్థాయిలో అతిపెద్ద క్షీణతకు దారితీసింది.
మరోవైపు సౌదీ అరేబియా రష్యాతో ధరల యుద్ధాన్ని ప్రారంభించిన తరువాత గ్లోబల్ స్టాక్స్ భారీగా పడిపోతున్నాయి. అటు ముడి చమురు ధరలు 33 శాతం పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గాల వైపు తరలిపోతున్నారు. ముఖ్యంగా బాండ్స్ వైపు వెళుతున్నారు. అలాగే సోమవారం యూరోపియన్ మార్కెట్లు సైతం భారీ నష్టాలను చవిచూశాయి, లండన్ 8 శాతానికి పైగా పడిపోయింది, ఫ్రాంక్ఫర్ట్ 7 శాతానికి పైగా పడిపోయింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలు అస్థిర వాణిజ్యంలో పడిపోయాయి, అయితే సురక్షితమైన యెన్ పెరిగింది. వాల్ స్ట్రీట్ లో సైతం భారీగా పతనానికి దారి తీస్తోంది. జపాన్ వెలుపల ఆసియా-పసిఫిక్ షేర్ల MSCI విస్తృత సూచిక 2015 ఆగస్టు నుండి దాని చెత్త రోజులో 4.4 శాతం కోల్పోయింది, షాంఘై బ్లూ చిప్స్ 2.9 శాతం పడిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nifty, Sensex, Stock Market