గత ఆర్థిక సంవత్సరం టూవీలర్ అమ్మకాలు భారీగా పతనమయ్యాయి. ఎంతలా అంటే గడిచిన 13 సంవత్సరాలతో పోల్చితే ఈ సంవత్సరమే అత్యంత తక్కువగా టూ వీలర్ అమ్మకాలు జరిగినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ వేసిన అంచనాలో టాప్ కంపెనీలైన హీరో, హోండా, టీవీఎస్ లాంటి మేజర్ కంపెనీలు ఏకంగా తమ ఉత్పత్తిని సైతం తగ్గించుకునే స్థాయికి టూవీలర్ అమ్మకాలు పతనమయ్యాయి. ముఖ్యంగా గ్రామీణ, అలాగే చిన్న పట్టణాల్లో డిమాండ్ లేకపోవడంతో టూవీలర్స్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అలాగే 125 సీసీ వాహనాల ధరలు అమాంతం పెరగడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది.
అయితే ఈ ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మీద కూడా పడొచ్చనే వార్త వినిపిస్తోంది. ముఖ్యంగా రానున్న కాలంలో టూవీలర్ ధరలు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకూ పెరగవచ్చనే అంచనాలతో ఆటోమొబైల్ కంపెనీల్లో గుబులు రేపుతోంది. అయితే కొత్తగా ప్రవేశ పెట్టిన నిబంధనలు, నూతన పన్ను విధానం, ముడిసరుకుల ధరలు పెరగడం వంటి అంశాలతో టూవీలర్స్ ఒక్కసారిగా పెరిగాయని ఈవై ఇండియా కన్సెల్టెన్సీ పార్ట్ నర్ రాకేష్ బాత్రా అన్నారు. ఇదిలా ఉంటే ఆదాయపు పన్ను శ్లాబుల సవరణ, బీఎస్ 6 వాహనాలు తప్పనిసరి చేయడం వంటి అంశాలు టూవీలర్స్ సేల్స్ పెరిగేందుకు దోహదం చేస్తాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్ అంచనా వేసింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.