EV Scooter: భారత్‌లో విద్యుత్ స్కూటర్లపైనే అందరి దృష్టి.. పోటీలో ఉన్న టాప్-3 కంపెనీలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

భవిష్యత్తు విద్యుత్ వాహనాలదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. పర్యావరణ కాలుష్యం, పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఆటో సంస్థలు ఈవీల(EV) వైపు మొగ్గుచూపుతున్నాయి. దేశంలో మొత్తం వాహనాల అమ్మకాల్లో 75 శాతం వాటా ద్విచక్రవాహనాలదే ఉంది. దీంతో ఇప్పటికే పలు టూ-వీలర్ సంస్థలు ఎలక్ట్రిక్ వేకిల్స్ తయారీ దిశగా ముందడుగు వేశాయి.

  • Share this:
భవిష్యత్తు విద్యుత్ వాహనాలదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. పర్యావరణ కాలుష్యం, పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఆటో సంస్థలు ఈవీల(EV) వైపు మొగ్గుచూపుతున్నాయి. దేశంలో మొత్తం వాహనాల అమ్మకాల్లో 75 శాతం వాటా ద్విచక్రవాహనాలదే ఉంది. దీంతో ఇప్పటికే పలు టూ-వీలర్ సంస్థలు ఎలక్ట్రిక్ వేకిల్స్ తయారీ దిశగా ముందడుగు వేశాయి. రాబోయే కాలంలో మెరుగైన మార్కెట్ వాటా పొందడమే లక్ష్యంగా భారత ద్విచక్రవాహన సంస్థలు తమ ఈవీ ప్రణాళికలను వేగవంతం చేశాయి. ఈ క్రమంలో భారత్‌లో విద్యుత్ వాహనాలపై దృష్టి కేంద్రీకరించిన టాప్-3 లిస్టెడ్ కంపెనీలు ఏవో చూద్దాం.

బజాజ్ ఆటో..
ప్రపంచంలోని మోటార్ సైకిళ్ల ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉంది బజాజ్ ఆటో. భారత్‌లో ఈ సంస్థ రెండో స్థానంలో ఉంది. గతేడాది ఈ సంస్థ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ క్రమంలో 12 ఏళ్ల తర్వాత స్కూటర్ విభాగంలోకి ప్రవేశించింది. అధునాతన, అత్యంత యాక్టివ్ ఈవీలను తీసుకురావడానికి బజాజ్ ఆటో.. ప్రత్యేక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. అభివృద్ధి చెందుతున్న మొబిలిటీనీ ఇది మరింత మెరుగుపరుస్తుందని చెబుతోంది. రెండు, మూడు, నాలుగు చక్రాల ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీకి ఈ వెంచర్ సహాయపడుతుందని భావిస్తోంది. ఇందుకోసం 100 కోట్ల అధీకృత మూలధనంతో ఈ అనుబంధం సంస్థను ఏర్పాటు చేయనుంది. ప్రత్యామ్నాయంగా బజాజ్ ఆటో ప్రీమియం బ్రాండ్ అయిన కేటీఎం కూడా భారత్ విద్యుత్ మోటార్ సైకిళ్లపై పనిచేయనుంది.

టీవీఎస్ మోటార్స్..
భారత్‌లో మూడో అతిపెద్ద ద్విచక్రవాహనాల తయారీదారైన టీవీఎస్ మోటార్ కంపెనీ 10 బిలియన్ల రూపాయలను ఈవీల ఉత్పత్తికి పెట్టుబడిగా పెట్టాలని ప్రణాళిక రూపొందించింది. ముందుగా 5 నుంచి 25 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ద్విచక్ర, త్రిచక్ర వాహనాల పోర్ట్ ఫోలియోపై దృష్టి పెట్టింది. రెండేళ్లలో అన్నింటినీ ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. డెలివరీ, కమ్యూటర్ ప్రీమియం, హై పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్, ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల విభాగాల్లో ఈవీలను ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
విదేశీ మార్కెట్లలో సైతం విద్యుత్ వాహనాలను విడుదల చేయాలని చూస్తోంది టీవీఎస్. ఈ సంస్థ తన మొట్టమొదటి ఈవీ అయిన ఐక్యూబ్‌ను బెంగళూరు, పుణె, కోయంబత్తూర్, దిల్లీ, పుణెలో విడుదల చేసింది. 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారత్‌లోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఉన్న 1000 మంది డీలర్ల వద్దకు తీసుకెళ్లనుంది.

హీరో మోటోకార్ప్..
ప్రపంచంలో అతిపెద్ద ద్విచక్రవాహన తయారీదారు హీరో సంస్థ. భారత్ మార్కెట్లో ఈ కంపెనీ 37.1 శాతం వాటాను కలిగి ఉంది. ఇటీవలే విద్యుత్ వాహనల శ్రేణిలో ప్రవేశించినట్లు కంపెనీ ప్రకటించింది. జైపూర్, స్టెఫాన్కర్చెన్(జర్మనీ)లో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెటప్స్ ప్రారంభించింది. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 నుంచి 10 బిలియన్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ఇంతకుముందు తైవాన్ కు చెందిన గోగోరో ఇంక్ అనే కంపెనీతో కలిసి బ్యాటరీ స్వాపింగ్ ప్లాట్ ఫాంలో పనిచేయాలని నిర్ణయించింది. అయితే విద్యుత్ వాహనాలను అభివృద్ధి చేయాలని అనంతరం ఈ రెండు సంస్థలు భావించాయి. ఇప్పటికే ఈవీ స్టార్టప్ అయిన ఏథర్ ఎనర్జీలో హీరో సంస్థ పెట్టుబడులు పెట్టింది.

లిథియం- అయాన్ బ్యాటరీ..
విద్యుత్ వాహనాలకు లిథియం అయాన్(Li-ion) బ్యాటరీలు హృదయం లాంటివి. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా వ్యాప్తి చెందడం వల్ల దేశంలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీ ఆవశ్యకత ఏర్పడింది. ఎలక్ట్రో-కెమికల్ ఎనర్జీ కోసం లిథియం అయాన్ బ్యాటరీలు ప్రైమరీ స్టోరేజీ ఆప్షన్ గా పనిచేస్తాయి. ఈ బ్యాటరీలను పునర్వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం మనదేశంలో ఈ లిథియం అయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమ ప్రారంభ దశలోనే ఉంది. అమర్ రాజా బ్యాటరీలు, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ లాంటి కీలక సంస్థలు లిథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తి ప్రణాళికలను వేగవంతం చేస్తున్నాయి.
Published by:Veera Babu
First published: