Home /News /business /

INDIAS RICE PRODUCTION IS LIKELY TO DECLINE 6 PER CENT IN THE KHARIF SEASON WILL IT IMPACT RICE PRICES GH SRD

Rice Production: ఖరీఫ్ సీజన్‌లో 6% తగ్గిన వరి సాగు.. బియ్యం ధరలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

Rice

Rice

Rice Production: ఈ ఏడాది బియ్యం ధరలు ఎక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఖరీఫ్ సీజన్‌లో భారతదేశంలో వరిసాగు విస్తీర్ణం 6 శాతం తగ్గినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో రైస్ ఉత్పత్తి 104.99 మిలియన్ టన్నులకు పడిపోయే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ఇండియా (India)లో బియ్యం ధరలు (Rice Prices) గత కొంత కాలంగా పెరుగుతున్నాయి. వివిధ దేశాల్లో ఆహార ధాన్యాల కొతర కారణంగా వ్యాపారులు విదేశాలకు బియ్యం ఎగుమతి చేయడంతో ఒక్కసారిగా రైస్‌కు డిమాండ్(Demand) పెరిగింది. అయితే అప్రమత్తమైన ప్రభుత్వం (Central Government) బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. కానీ ఈ ఏడాది బియ్యం ధరలు ఎక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఖరీఫ్ సీజన్‌లో భారతదేశంలో వరిసాగు విస్తీర్ణం 6 శాతం తగ్గినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో రైస్ ఉత్పత్తి 104.99 మిలియన్ టన్నులకు పడిపోయే అవకాశం ఉంది. గత ఏడాది బియ్యం ఉత్పత్తి 111.76 మిలియన్ టన్నులుగా ఉంది. బియ్యం ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, జార్ఖండ్‌లో వర్షాలు లేక వరి నాట్లు తగ్గడం దీనికి కారణంగా చెబుతున్నారు. * వర్షాలు కురవక తగ్గిన సాగు విస్తీర్ణం జార్ఖండ్‌లో ఈ ఏడాది 9.37 లక్షల హెక్టార్లలో వరి సాగు తగ్గింది. మధ్యప్రదేశ్‌లో 6.32 లక్షల హెక్టార్లు, పశ్చిమ బెంగాల్ 3.65 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 2.48 లక్షల హెక్టార్లు, బీహార్‌లో 1.97 లక్షల హెక్టార్లలో వరి సాగు తగ్గింది. జూన్ నుంచి నైరుతి రుతుపవనాల ప్రారంభంతో ఖరీఫ్ సీజన్‌లో నాట్లు ప్రారంభమవుతాయి. అక్టోబర్ నుంచి పంటలు పండుతాయి. వరి ప్రధానంగా ఖరీఫ్ సీజన్‌లో పండిస్తారు. మొత్తం వరి ఉత్పత్తిలో 85 శాతం ఈ సీజన్‌లోనే సాగవుతుంది. మిగిలిన 15 శాతం రబీ (శీతాకాలం) సీజన్‌లో పండిస్తారు. బియ్యం ఉత్పత్తి తగ్గడం వల్ల 2021-22 ఖరీఫ్ సీజన్‌లో 156.04 మిలియన్ టన్నుల నుంచి 2022-23 ఖరీఫ్ సీజన్‌కు దేశం మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 149.92 మిలియన్ టన్నులకు తగ్గుతుందని అంచనా. * స్వల్పంగా తగ్గున్న కందిపప్పు, మినప్పప్పు ఉత్పత్తి ఖరీఫ్ సీజన్‌లో బియ్యంతో పాటు తృణధాన్యాలు, పప్పులు పండిస్తారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో పప్పుధాన్యాల ఉత్పత్తి గత ఏడాది స్థాయి అయిన 8.37 మిలియన్ టన్నులకు చేరుకుంది. కందిపప్పు, మినప్పప్పు ఉత్పత్తిలో స్వల్ప తగ్గుదల ఉంది. తృణధాన్యాల ఉత్పత్తి ఈ ఖరీఫ్ సీజన్‌లో 35.91 మిలియన్ టన్నుల నుంచి 36.56 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. ఈ కాలంలో మొక్కజొన్న ఉత్పత్తి 22.63 మిలియన్ టన్నుల నుంచి రికార్డు స్థాయిలో 23.10 మిలియన్ టన్నులకు చేరుకుంది. * చెరకు రికార్డు వాణిజ్య పంటల విషయానికొస్తే 2022-23 సంవత్సరంలో పత్తి ఉత్పత్తి 34.19 మిలియన్ బేళ్లకు పెరుగుతుందని సంబంధిత మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఇది గత సంవత్సరం 31.20 మిలియన్ బేళ్లుగా ఉంది. చెరకు ఉత్పత్తి ఈ కాలంలో 431.8 మిలియన్ టన్నుల నుంచి రికార్డు స్థాయిలో 465.05 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది కూడా చదవండి : పండుగ సీజన్.. ఉద్యోగులందరికీ 11 రోజులు సెలవులు! గత సంవత్సరం జనపనార ఉత్పత్తి 10.31 మిలియన్ బేళ్లు ఉండగా, ప్రస్తుతం 10.09 మిలియన్ బేళ్లు రావచ్చని తెలిపారు. ఆహార ధాన్యేతర కేటగిరీలో నూనె గింజల ఉత్పత్తి ఈ ఖరీఫ్ సీజన్‌లో 23.57 మిలియన్ టన్నులుగా ఉండవచ్చని భావిస్తున్నారు. గత ఏడాదిలో ఇది 23.88 మిలియన్ టన్నులుగా ఉంది. ఈ కాలంలో సోయాబీన్ ఉత్పత్తి 12.99 మిలియన్ టన్నుల నుంచి 12.89 మిలియన్ టన్నులకు తగ్గింది. * బియ్యం ధరలపై ప్రభావం? ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశంలో ఎక్కువగా వరి పండుతుంది. ప్రపంచ మార్కెట్‌లో 40 శాతం వాటాను అందిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో బియ్యం ఉత్పత్తి తగ్గుదల బియ్యం ధరలపై ప్రభావం చూపవచ్చు. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో ఇటీవల గోధుమల ధరలు కూడా పెరిగాయి. రష్యా , ఉక్రెయిన్‌లు గోధుమల ప్రధాన ఎగుమతిదారులు. వారి మధ్య వివాదం ప్రపంచ గోధుమ సరఫరాలో అంతరాయాలకు దారితీసింది. దీంతో ఇండియాలో గోధుమలకు డిమాండ్ పెరిగింది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Central Government, Price, Rice, Wheat

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు