INDIAS OWN DIGITAL CURRENCY TO BE INTRODUCED IN PHASED MANNER RBI FORMS INNOVATION HUB GH MKS
India’s Cryptocurrency : ఇండియాకు సొంతగా డిజిటల్ కరెన్సీ.. RBI సంచలన ప్రణాళిక ఇదే..
సొంత క్రిప్టోపై ఆర్బీఐ కసరత్తు (ప్రతీకాత్మక చిత్రం)
డిజిటల్ కరెన్సీ గురించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. మే 27న విడుదలైన వార్షిక నివేదికలో "సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (Central Bank Digital Currency(CBDC)"ని ప్రవేశపెట్టడానికి “గ్రేడెడ్ అప్రోచ్” లేదా దశలవారీ విధానాన్ని అనుసరించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
ప్రస్తుతం చెలామణిలో ఉన్న నగదుతో పాటు డిజిటల్ కరెన్సీ (Digital Currency)ని కూడా ఇండియాలో ప్రవేశపెట్టాలని ఆర్బీఐ ప్లాన్ చేస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడున్న డబ్బు లాగానే డిజిటల్ కరెన్సీ ఉంటుందని, దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయని ఆర్బీఐ చెబుతూ వస్తోంది. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank Of India) తన యాన్యువల్ రిపోర్ట్ 2022 (Annual Report 2022)లో డిజిటల్ కరెన్సీ గురించి కీలక ప్రకటన చేసింది. మే 27న విడుదలైన వార్షిక నివేదికలో "సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (Central Bank Digital Currency(CBDC)"ని ప్రవేశపెట్టడానికి “గ్రేడెడ్ అప్రోచ్” లేదా దశలవారీ విధానాన్ని అనుసరించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
ఈ డిజిటల్ కరెన్సీ కాయిన్ డిజైన్ ద్రవ్య విధానం, ఆర్థిక స్థిరత్వం, కరెన్సీ, పేమెంట్ సిస్టమ్స్‌ల సమర్ధవంతమైన కార్యకలాపాల లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా రూపొందిస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. డిజిటల్ కరెన్సీని పరీక్షించే, పైలట్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించే స్థితిలో ఉన్నామని ఆర్బీఐ గతంలో ఒక ప్రకటన చేసింది. ఇప్పుడేమో దశలవారీగా డిజిటల్ కరెన్సీని తీసుకొస్తామని వెల్లడించింది.
“భారతదేశంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC)ని ప్రవేశపెట్టడంలో రిజర్వ్ బ్యాంక్ నిమగ్నమైంది. సీబీడీసీ రూపకల్పన ద్రవ్య విధానం, ఆర్థిక స్థిరత్వం, కరెన్సీ, చెల్లింపు వ్యవస్థల సమర్థవంతమైన కార్యకలాపాల లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి" అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022 వార్షిక నివేదిక పేర్కొంది. "సీబీడీసీని ప్రవేశపెట్టడానికి గ్రేడెడ్ విధానాన్ని అవలంబించాలని రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదిస్తోంది, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, పైలట్లు, లాంచ్ వంటి దశల వారీగా ఆర్బీఐ వెళుతుంది" అని ఆర్బీఐ తన వార్షిక నివేదికలో వివరించింది. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే ఒక ఆలోచనను రియాలిటీగా మార్చవచ్చా లేదా ఆలోచన ఊహించినట్లుగానే నిజమవుతుందా అనేది నిర్ధారించడం. ఆర్బీఐ మొదటగా ఈ పని చేసేందుకు సిద్ధమవుతోంది.
భారతదేశంలో సీబీడీసీని ప్రవేశపెట్టడం వల్ల ఒనగూరే లాభాలు, నష్టాలను రిజర్వ్ బ్యాంక్ బేరీజు వేస్తోందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. "తదనుగుణంగా తక్కువ లేదా అసలు అంతరాయం లేకుండా అమలు చేయగల సీబీడీసీల డిజైన్ అంశాలు పరిశీలనలో ఉన్నాయి" అని అది పేర్కొంది. సీబీడీసీ గురించి 2022-23 యూనియన్ బడ్జెట్లో ఆర్బీఐ ప్రకటించింది. ఆ సందర్భంగానే ఆర్బీఐ చట్టం, 1934కి తగిన సవరణను ఫైనాన్స్ బిల్లు, 2022లో చేర్చారు. సీబీడీసీ ప్రారంభం కోసం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తూ ఆర్థిక బిల్లు, 2022 అమలులోకి వచ్చింది." అని ఆర్బీఐ తన వార్షిక నివేదికలో పేర్కొంది.
సీబీడీసీ అనేది డిజిటల్ రూపంలో సెంట్రల్ బ్యాంక్ జారీ చేసే చట్టపరమైన టెండర్. ఇది ఫియట్ కరెన్సీ (Fiat Currency)కి సమానంగా ఉంటుంది. వీటిని ఫియట్ కరెన్సీతో మార్పిడి చేసుకోవచ్చు. కాకపోతే వాటి రూపం భిన్నంగా ఉంటుంది. "సీబీడీసీ అనేది డిజిటల్ లేదా వర్చువల్ కరెన్సీ, అయితే ఇది గత దశాబ్దంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేట్ వర్చువల్ కరెన్సీలకు సమానంగా ఉండదు" అని ఆర్బీఐ గత సంవత్సరం సీబీడీసీ నిర్వచనంలో పేర్కొంది.
* ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు
"స్థిరమైన పద్ధతిలో, సంస్థాగత సెటప్ ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (RBIH) రిజర్వ్ బ్యాంక్ అనుబంధ సంస్థగా ఏర్పాటైంది," అని రిపోర్ట్ పేర్కొంది. ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్‌కు స్వతంత్ర బోర్డు ఉంది. ఈ హబ్ ఆర్థిక రంగ సంస్థలు, సాంకేతికత, పరిశ్రమలు, విద్యాసంస్థలతో సహకరిస్తుంది. అలానే ఇంకా చాలా విషయాల్లో ఇన్నోవేషన్ హబ్ సహకరిస్తుంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.