Expensive Apartment: ఇండియాలో రియల్ ఎస్టేట్ బూమ్, లగ్జరీ హౌసింగ్ మార్కెట్ ఒక రేంజ్‌లో దూసుకెళ్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు, ప్రముఖులు చేస్తున్న ప్రాపర్టీ కొనుగోళ్లు వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవలే ఇండియాలో అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్‌ను బజాజ్ ఆటో ఛైర్మన్ నీరజ్ బజాజ్ కొనుగోలు చేశారు. ఆయన మలబార్ హిల్‌లో సముద్రానికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌ను రూ.252.5 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ కాస్ట్లీ డీల్‌ను కాంట్రాసెప్టివ్ మేకర్ ఫేమీ కేర్ (Famy Care) వ్యవస్థాపకుడు JP తపారియా అధిగమించారు. అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్(Most expensive apartment) కొనుగోలు చేసిన వ్యక్తిగా నిలిచారు. ఆయన ఒక ట్రిప్లెక్స్ కోసం ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? రూ.369 కోట్లు. ఇంత విలువైన ఆ అపార్ట్‌మెంట్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
ఈ అపార్ట్‌మెంట్‌ను లోధా గ్రూప్ నుంచి JP తపారియా కొనుగోలు చేశారు. సౌత్ ముంబైలోని మలబార్ హిల్‌లో సీ ఫేసింగ్‌లో ఈ విలాసవంతమైన ట్రిప్లెక్స్ అపార్ట్‌మెంట్ ఉందని ET (ఎకనామిక్ టైమ్స్) నివేదిక తెలిపింది. వల్కేశ్వర్ రోడ్‌లో ఉన్న ఈ సూపర్-లగ్జరీ రెసిడెన్షియల్ టవర్ లోధా మలబార్‌లో 26, 27, 28 అంతస్తులలో అపార్ట్‌మెంట్ ఉందని పేర్కొంది. మొత్తం 27,160 చదరపు అడుగుల విస్తీర్ణంలో ట్రిప్లెక్స్ ఉంది. చదరపు అడుగును దాదాపు రూ.1.36 లక్షలుగా నిర్ణయించారు. చదరపు అడుగుల ప్రాతిపదికన, మొత్తం విలువతో పాటు దేశంలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్షియ్ ట్రాన్సాక్షన్‌గా నిలిచిందని ET పేర్కొంది.
OMG: నగర వాసులకు భారీ షాక్.. వారంపాటు ఫ్లై ఓవర్ మూసివేత.. ఎందుకంటే..?
* రూ.10 కోట్ల వరకు డిడక్షన్‌లు
లగ్జరీ రియల్ ఎస్టేట్ డీల్ కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే బడ్జెట్ 2023 పరిధిలోకి రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 ఫిబ్రవరి 1న తన బడ్జెట్ ప్రసంగంలో.. ‘పన్ను రాయితీలు, మినహాయింపుల మెరుగైన లక్ష్యం కోసం, గరిష్ట స్థాయిని ప్రతిపాదించాం. సెక్షన్ 54, 54F కింద రెసిడెన్షియల్ హైస్ పెట్టుబడిపై క్యాపిటల్ గెయిన్స్ నుంచి రూ.10 కోట్ల వరకు డిడక్షన్‌లు ఉంటాయి.’ అని చెప్పారు.
ప్రస్తుతం, అటువంటి క్యాపిటల్ గెయిన్స్ లేదా నెట్ వ్యాల్యూ ఒక సంవత్సరం ముందు లేదా రెండు సంవత్సరాల వ్యవధిలో (ప్రాపర్టీ కన్‌స్ట్రక్ట్ చేసిన మూడు సంవత్సరాల లోపు) కొత్త రెసిడెన్షియల్ ప్రాపర్టీలో తిరిగి ఇన్వెస్ట్ చేస్తే, ప్రస్తుతం ఇండివిడ్యువల్స్, HUFలకు ఈ డిడక్షన్ అందుబాటులో ఉంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్రాన్స్‌ఫర్‌తో లభించే మొత్తానికి ఎటుంటి మానిటరీ లిమిట్ లేకుండా డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. బడ్జెట్ 2023 ఈ డిడక్షన్‌ను రూ.10 కోట్లకు పరిమితం చేయాలని ప్రతిపాదించింది. రూ.10 కోట్లకు మించిన క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
* ఊపందుకున్న లగ్జరీ హౌసింగ్ మార్కెట్
దేశంలోని లగ్జరీ హౌసింగ్ మార్కెట్‌లో JP తపారియా డీల్ లేటెస్ట్ డెవలప్‌మెంట్. లగ్జరీ హౌసింగ్ మార్కెట్‌లో డిమాండ్ ఊపందుకుంది. ఫిబ్రవరిలో, డిమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ కుటుంబ సభ్యులు, సహచరులు ముంబైలో రూ.1,238 కోట్ల విలువైన 28 హౌసింగ్ యూనిట్లను కొనుగోలు చేశారు. ఇది బహుశా భారతదేశంలో అతిపెద్ద ఆస్తి ఒప్పందం. అదే నెలలో, రియల్ ఎస్టేట్ డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడానికి చెంబూర్‌లోని రాజ్ కపూర్ బంగ్లాను కొనుగోలు చేసింది. అలానే గత వారం రియల్టీ మేజర్ DLF లిమిటెడ్ కూడా గురుగ్రామ్‌లోని తన హౌసింగ్ ప్రాజెక్ట్‌లో రూ.7 కోట్లు, అంతకంటే ఎక్కువ ధర కలిగిన 1,137 లగ్జరీ అపార్ట్‌మెంట్‌లను 3 రోజుల్లో రూ.8,000 కోట్లకు విక్రయించినట్లు ప్రకటించింది.
https://www.news18.com/business/indias-most-expensive-apartment-deal-j-p-taparia-buys-triplex-in-south-mumbai-for-rs-369-crore-7422493.html
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mumbai