Home /News /business /

Hero MotoCorp: వాహన ప్రియులకు షాకింగ్​ న్యూస్​.. భారీగా పెరిగిన హీరో మోటోకార్ప్​ బైక్స్​ ధరలు.. కొత్త ధరల వివరాలివే!

Hero MotoCorp: వాహన ప్రియులకు షాకింగ్​ న్యూస్​.. భారీగా పెరిగిన హీరో మోటోకార్ప్​ బైక్స్​ ధరలు.. కొత్త ధరల వివరాలివే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hero MotoCorp: భారత టూవీలర్​ మార్కెట్​లో అత్యధికంగా అమ్ముడైన స్ప్లెండర్​ బైక్​ ధరలను పెంచుతూ హీరో మోటోకార్ప్​ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. పెరుగుతున్న ముడిసరుకు ధరలు, రవాణా వ్యయాల దృష్ట్యా ధర పెంచాల్సిన అనివార్యత ఏర్పడిందని హీరో మోటోకార్ప్​ ప్రకటించింది.

ఇంకా చదవండి ...
Hero MotoCorp: భారత టూవీలర్​ మార్కెట్​లో అత్యధికంగా అమ్ముడైన స్ప్లెండర్​ బైక్​ ధరలను పెంచుతూ హీరో మోటోకార్ప్​ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. పెరుగుతున్న ముడిసరుకు ధరలు, రవాణా వ్యయాల దృష్ట్యా ధర పెంచాల్సిన అనివార్యత ఏర్పడిందని హీరో మోటోకార్ప్​ ప్రకటించింది. ఇదే కారణంతో అన్ని ఆటోమొబైల్​ కంపెనీలు ఇటీవల వరుసగా ధరల పెంపు నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవల ప్రీమియం వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన బైక్​ ధరలను అమాంతం పెంచేసింది. ఇప్పుడు ఈ జాబితాలోకి హీరో మోటోకార్ప్​ కూడా చేరింది.

తాజా రేట్ల ప్రకారం, అత్యంత ప్రాచుర్యం పొందిన స్ప్లెండర్​ బైక్​ ధరలు సుమారు రూ. 1,000 నుంచి రూ.2,000 వరకు పెరిగాయి. వీటితో పాటు మాస్ట్రో ఎడ్జ్​, డెస్టినీ 125, ప్లెజర్​ ప్లస్​ స్కూటీ ధరలు కూడా పెరిగాయి. అయితే, హీరో కంపెనీకి చెందిన ఎంట్రీ లెవల్​ కిక్ స్టార్ట్, డ్రమ్ బ్రేక్‌ స్పెండర్​ వేరియంట్‌కు ధరలో మాత్రం ఎటువంటి మార్పు చేయలేదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎక్స్​షోరూమ్​ల వద్ద మనుపటి ధర రూ. 64,850 వద్దే లభిస్తుంది. తాజాగా సవరించిన ధరల ప్రకారం హీరో వేరియంట్ల ధరలను పరిశీలిద్దాం.

హీరో మోటోకార్ప్​ బైక్​ల కొత్త ధరలు

స్ప్లెండర్ ప్లస్ (కిక్​ స్టార్ట్​ విత్​ డ్రమ్ బ్రేక్స్​) వేరియంట్​ రూ. 64,850
స్ప్లెండర్ ప్లస్ (సెల్ఫ్​ స్టార్ట్​ విత్​ డ్రమ్ బ్రేక్స్​) వేరియంట్​ రూ. 67,160
స్ప్లెండర్ ప్లస్ (సెల్ఫ్ స్టార్ట్ విత్ డ్రమ్ బ్రేక్స్, i3 ఎస్) వేరియంట్​ రూ. 68,360
స్ప్లెండర్ ఐస్మార్ట్​ (డ్రమ్ బ్రేక్స్) వేరియంట్​ రూ. 69,650
స్ప్లెండర్ ప్లస్ 100 మిలియన్ ఎడిషన్ రూ. 70,710
స్ప్లెండర్ ఐస్మార్ట్​ (డిస్క్ బ్రేక్స్​) వేరియంట్​ రూ. 72,350
7. సూపర్ స్ప్లెండర్ (డ్రమ్ బ్రేక్స్) వేరియంట్​ రూ. 73,900
సూపర్ స్ప్లెండర్ (డిస్క్ బ్రేక్స్​) వేరియంట్​ రూ. 77,600

కాగా, వచ్చే నెలలో రానున్న దసరా, దీపావళి పండుగ సీజన్​కు ముందే తమ బైక్​ వేరియంట్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ గత నెలలో ప్రకటించింది. మోడల్, వేరియంట్ ఆధారంగా రూ. 3,000 వరకు పెరగనున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే, ధరలు పెరిగినప్పటికీ రాబోయే పండుగ సీజన్​లో డిమాండ్​ ఆశాజనకంగా ఉంటుందని హీరో మోటోకార్ఫ్​ అంచనా వేస్తుంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Bikes

తదుపరి వార్తలు