హోమ్ /వార్తలు /బిజినెస్ /

2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.3%: ప్రపంచ బ్యాంక్

2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.3%: ప్రపంచ బ్యాంక్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.3 శాతం ఉండొచ్చని అంచనా వేస్తోంది ప్రపంచ బ్యాంకు. 2017-18లో వృద్ధి రేటు 6.7 శాతం మాత్రమే. అంటే 2017-18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు పెరుగుతోంది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశం 2019-20 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగనుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.5 శాతం ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.3 శాతం ఉండొచ్చని అంచనా వేస్తోంది ప్రపంచ బ్యాంకు. 2017-18లో వృద్ధి రేటు 6.7 శాతం మాత్రమే. అంటే 2017-18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు పెరుగుతోంది. అంతేకాదు... రాబోయే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఇంకా పెరుగుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తోంది. గతేడాది అక్టోబర్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి భారతదేశ వృద్ధి రేటు 7.4 శాతం అని అంచనా వేసింది.

దక్షిణాసియా దేశాల్లో ఎన్నికల సమయం కావడంతో కాస్త రాజకీయ అనిశ్చితి ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయ పడింది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్‌లో ప్రపంచ వృద్ధి రేటు 2.9 శాతంగా నమోదైంది. గతేడాది 3 శాతం ఉండేది. తగ్గుముఖం పట్టింది. అంతేకాదు... రాబోయే రెండేళ్లలో ప్రపంచ వృద్ధి రేటు 2.8 శాతానికి తగ్గొచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది. ఈ నిరాశావాదానికి ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు, ఉత్పత్తి తగ్గుముఖం పట్టడమే కారణమన్నది ప్రపంచ బ్యాంకు అభిప్రాయం.

ఇవి కూడా చదవండి:

ALERT: ఈ పాలసీలను నిలిపేసిన ఎల్ఐసీ... అవి మీ దగ్గర ఉంటే ఏం చేయాలి?

రూ.4,000 తగ్గింపుతో రెడ్‌మీ నోట్ 5 ప్రో

సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఐఆర్‌సీటీసీ నుంచి గుడ్‌ న్యూస్

ఎస్‌బీఐ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్‌తో మీకు లాభమెంతో తెలుసుకోండి...

First published:

Tags: GDP, Imf, World Bank

ఉత్తమ కథలు