ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC) ఆధ్వర్యంలో ఒడిశాలో భారతదేశపు మొట్టమొదటి ఒలింపిక్ విలువల విద్యా కార్యక్రమాన్ని(OVEP) ఐఓసీ సభ్యురాలైన నీతా అంబానీ (Nita Ambani) ప్రారంభించారు. ఒలింపిక్ వ్యాల్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ విద్య, క్రీడల జంట శక్తుల మిళితం చేస్తుందని, ఒలింపిజం ప్రధాన విలువలను పెంపొందిస్తుందని అన్నారు. యువకులకు శ్రేష్ఠత, గౌరవం, స్నేహాలతో ఒలింపిక్ విలువలను పరిచయం చేయడానికి IOC రూపొందించిన వనరుల ఆచరణాత్మక సమితి OVEP. పిల్లలు చురుకుగా, ఆరోగ్యంగా, బాధ్యతాయుతమైన పౌరులుగా మార్చడం, విలువల-ఆధారిత పాఠ్యాంశాలను వ్యాప్తి చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. భారతదేశం ఒలింపిక్ ఉద్యమంలో ఇది ఓ మైలురాయి. OVEP ప్రారంభం ప్రతిష్టాత్మక IOC 2023 సెషన్‌కు ముందడుగా నిలుస్తుంది.
2023లో IOC సెషన్‌ను నిర్వహించడానికి భారతదేశం బిడ్ కోసం ప్రతినిధి బృందానికి ఈ ఏడాది ప్రారంభంలో నీతా అంబానీ నాయకత్వం వహించారు. సుమారు 40 సంవత్సరాల విరామం తర్వాత ఏకగ్రీవంగా హక్కులను పొందారు. భారతదేశంలో IOC సెషన్ భారతీయ క్రీడా చరిత్రలో ఒక కొత్త శకాన్ని సూచిస్తుంది. దేశంలో క్రీడా పర్యావరణ వ్యవస్థతో భారతదేశ ఒలింపిక్ ఆకాంక్షలకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. యువతను వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, ప్రపంచ పురస్కారాలను తీసుకురావడానికి ప్రోత్సహిస్తుంది.
Govt Scheme: ఆ స్కీమ్‌లో ఉన్నవారికి అలర్ట్... మే 31 లాస్ట్ డేట్
నీతా అంబానీ పలు ఒలింపిక్ ఉద్యమ కమీషన్‌లలో భాగంగా ఉన్నారు. ఒలింపిక్ విద్య పరిధిలోకి వచ్చే OVEP ముఖ్యంగా ఆమె హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఇది పిల్లలలో ప్రధాన ఒలింపిక్ విలువలను పెంపొందించడంలో సహాయపడుతుంది.
OVEP ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, IOC సభ్యురాలు నీతా అంబానీ, IOC ఎడ్యుకేషన్ కమిషన్ ఛైర్ Mikaela Cojuangco Jaworski, ఒలిపియన్, ఐఓసీ అథ్లెట్స్ కమిషన్ సభ్యులు అభినవ్ బింద్రా, ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నరీందర్ బాత్రా పాల్గొన్నారు. OVEP ఒడిశా పాఠశాల విద్యా వ్యవస్థలో విలీనం చేయబడుతుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ అండ్ మాస్ ఎడ్యుకేషన్, ఒడిశా ప్రభుత్వం, అభినవ్ బింద్రా ఫౌండేషన్ ట్రస్ట్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం అభివృద్ధి చేయబడుతోంది.
PM Kisan Scheme: పీఎం కిసాన్ రైతులకు అలర్ట్... ఆ వార్తల్లో నిజమెంత? తెలుసుకోండి
భారతదేశ ఒలింపిక్ కల, అట్టడుగు అభివృద్ధికి తమ నిరంతర మద్దతు కోసం ఒడిశా ప్రభుత్వానికి నీతా అంబానీ కృతజ్ఞతలు తెలిపారు. పట్నాయక్ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, పెరిగిన పెట్టుబడులు, ప్రయత్నాల ద్వారా, భారతదేశ క్రీడా ఆశయాలకు ఒడిషా కేంద్రంగా మారిందని ఆమె అన్నారు. రాష్ట్రం క్రీడల కోసం సంపూర్ణ పర్యావరణ వ్యవస్థను చురుకుగా సృష్టిస్తోందని, ఇది యువ క్రీడాకారులకు అత్యుత్తమ నాణ్యత శిక్షణ, మౌలిక సదుపాయాలను అందిస్తుందని అన్నారు.
ఇక ఇప్పటికే ఒడిషా రిలయన్స్ ఫౌండేషన్ అథ్లెటిక్స్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్ (HPC) కోసం రిలయన్స్ ఫౌండేషన్ ఒడిశా ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేస్తుంది. HPCకి చెందిన ఇద్దరు రిలయన్స్ ఫౌండేషన్ అథ్లెట్లు జ్యోతి యర్రాజీ, అమ్లాన్ బోర్గోహైన్, గత నెలలో అంతర్జాతీయ అథ్లెటిక్ ఈవెంట్‌లలో జాతీయ రికార్డులను బద్దలు కొట్టారు. పతకాలు సాధించారు. జ్యోతి అద్భుతంగా పరుగులు తీస్తోంది. మొదట్లో 19 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టి, ఆ తర్వాత జరిగిన ఈవెంట్‌లో తన సొంత రికార్డును మెరుగుపరుచుకుంది. ఈ ఫీట్‌తో, జ్యోతి కామన్వెల్త్ గేమ్స్‌కు AFI అర్హత సమయాన్ని సంపాదించుకుంది. భారత క్రీడల భవిష్యత్తు సురక్షితమైన చేతుల్లో ఉందని హైలైట్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EDUCATION, Nita Ambani, Olympics, Reliance Foundation, Sports