ఇండియా ఆర్థిక వృద్ధి... అంచనాల కంటే తక్కువే : ఐఎంఎఫ్

IMF : 2019, 2020 సంవత్సరాల్లో భారత వృద్ధి రేటు 0.3 శాతం తగ్గుతుందని జులైలో IMF అంచనా వేసింది. ఇప్పుడేమో... ఆ అంచనాల కంటే వీక్‌గా భారత ఆర్థిక వ్యవస్థ ఉందని అంటోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 13, 2019, 1:07 PM IST
ఇండియా ఆర్థిక వృద్ధి... అంచనాల కంటే తక్కువే : ఐఎంఎఫ్
ఐఎంఎఫ్ లోగో (Image : Reuters)
Krishna Kumar N | news18-telugu
Updated: September 13, 2019, 1:07 PM IST
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందనీ, మాంద్యం వెంటాడుతోందనీ మనకు తెలుసు. అయితే... ఆ మందగమనం కొద్దిగానే అనీ, మాంద్యం పెద్దగా లేదనీ కేంద్రం చెబుతుంటే... ఆ అంచనాల కంటే నీరసంగా భార్త ఆర్థిక వ్యవస్థ ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్థ తాజాగా తెలిపింది. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల్లో మందగమనం, పర్యావరణ నిబంధనల్లో అనిశ్చితి, కొన్ని బ్యాంకింగేతర కంపెనీల్లో వీక్‌నెస్ వంటివి భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి బాలేదని చెబుతోంది. 2019, 2020 సంవత్సరాల్లో భారత వృద్ధి రేటును 0.3 శాతం తగ్గించిన IMF... అది 7, 7.2 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. దేశంలో డిమాండ్ పడిపోతోందని అభిప్రాయపడింది. ఐతే... ఇప్పటికీ... చైనా తర్వాత... భారతే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని వాషింగ్టన్‌కి చెందిన ఓ అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థ అభిప్రాయపడింది.

రాన్రానూ వృద్ధి రేటు ఫలితాలు, అంచనాలు తగ్గిపోతున్నాయన్నది IMF చెబుతున్న మాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం... ఏప్రిల్ నుంచీ జూన్ మధ్య తొలి త్రైమాసికంలో... భారత వృద్ధి రేటు 8 శాతం ఉండాల్సింది... 5 శాతం మాత్రమే నమోదైంది. ఇది ఏడు సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితిని గమనిస్తున్నామన్న IMF త్వరలోనే... సరికొత్త అంచనాలను వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్‌లో వెల్లడిస్తామని తెలిపింది. దీన్ని బట్టీ... IMF తన అంచనాల్ని మరింత తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...