కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ (Excise Duty) తగ్గించినా పెట్రోల్ ధర (Petrol Price) రూ.100 పైనే ఉంది. అందుకే బండి బయటకు తీయాలంటే సామాన్యులు ఆలోచించాల్సిన పరిస్థితి. రోజూ వాహనాల్లో ప్రయాణించేవారికి పెట్రోల్ భారం అవుతోంది. గతంతో పోల్చి చూస్తే పెట్రోల్‌కు కాస్త ఎక్కువ బడ్జెట్ పక్కన పెట్టాల్సి వస్తుంది. మరి ఇలాంటి సమయంలో పెట్రోల్ ఉచితంగా వస్తే ఎగిరిగంతేయడం ఖాయం. ఏడాదికి 68 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందొచ్చు. కానీ ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి. సిటీ బ్యాంక్ (Citi Bank) ఇండియన్ ఆయిల్‌తో ఒప్పందం చేసుకొని ఫ్యూయెల్ క్రెడిట్ కార్డ్ రూపొందించింది.
ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డ్ (IndianOil Citi Credit Card) పేరుతో ఈ క్రెడిట్ కార్డ్ అందుబాటులో ఉంది. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నవారు ఏడాదికి 68 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందొచ్చు. అంటే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపిన లావాదేవీలపై పొదుపు చేసే మొత్తం 68 లీటర్ల పెట్రోల్‌తో సమానం అని సిటీ బ్యాంక్ చెబుతోంది. 68 లీటర్ల పెట్రోల్‌కు సమానం అయిన మొత్తాన్ని ఎలా పొదుపు చేయొచ్చో వివరించింది. ఈ చార్ట్ చూడండి.
PhonePe: ఫోన్‌పేలో రూ.100 కే బంగారం కొనొచ్చు... ఎలా పొదుపు చేయాలో తెలుసుకోండి
ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డుతో లావాదేవీలు జరిపితే రివార్డ్స్ లభిస్తాయి. వీటిని టర్బో పాయింట్స్ అంటారు. ప్రతీ రూ.150 లావాదేవీపై 4 టర్బో పాయింట్స్ పొందొచ్చు. మెంబర్షిప్ సంవత్సరంలో రూ.30,000 లేదా అంతకన్నా ఎక్కువ లావాదేవీలు జరిపితే యాన్యువల్ ఫీజు ఉండదు. ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్స్‌లో ఫ్యూయెల్ కొంటే 1 శాతం సర్‌ఛార్జీ వెనక్కి వస్తుంది.
సూపర్ మార్కెట్లో, గ్రాసరీ స్టోర్స్‌లో ప్రతీ రూ.150 లావాదేవీపై 2 టర్బో పాయింట్స్, ఇతర ట్రాన్సాక్షన్స్‌పై ప్రతీ రూ.150కి ఒక టర్బో పాయింట్ చొప్పున వస్తాయి. ఒక టర్బో పాయింట్‌తో ఒక రూపాయి విలువైన ఫ్యూయెల్ కొనొచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా లేదా సిటీబ్యాంక్ ఆన్లైన్ ద్వారా రీడీమ్ చేసుకొని ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్స్‌లో ఫ్యూయెల్ కొనొచ్చు. ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డుతో జరిపే ట్రాన్సాక్షన్స్‌ని ఈఎంఐగా మార్చుకోవచ్చు. ఇన్స్టంట్ లోన్ కూడా పొందొచ్చు.
Pension Scheme: మీ వయస్సు 40 ఏళ్ల లోపా? నెలకు రూ.5,000 పెన్షన్ కావాలా? ఈ స్కీమ్‌లో చేరండి
ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే ఐడెండిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి. రెండు నెలల సాలరీ స్లిప్స్ కూడా ఇవ్వాలి. సిటీ బ్యాంక్ వెబ్సైట్లో లేదా సమీపంలో ఉన్న బ్రాంచ్‌లో క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Citi bank, Credit cards, Personal Finance, Petrol Price, Petrol prices