INDIANOIL CITI CREDIT CARD HOLDERS CAN GET UP TO 71 LITRES PETROL FOR FREE WITH REWARD POINTS KNOW HOW SS
Credit Card: ఈ క్రెడిట్ కార్డు తీసుకుంటే 71 లీటర్ల పెట్రోల్ ఉచితం
Credit Card: ఈ క్రెడిట్ కార్డు తీసుకుంటే 71 లీటర్ల పెట్రోల్ ఉచితం
(image: Citi Bank)
IndianOil Citi Credit Card | ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డ్ ఉంటే మీరు పెట్రోల్ కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ కార్డుపై వచ్చే రివార్డ్ పాయింట్స్‌తో నెలకు 71 లీటర్ల వరకు పెట్రోల్ ఉచితంగా పొందొచ్చు.
మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సిటీ బ్యాంక్ ఫ్యూయెల్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మొదటి ఏడాది 71 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందొచ్చని బ్యాంకు చెబుతోంది. సామాన్యులు పెట్రోల్, డీజిల్ కోసం చేసే ఖర్చు ఎక్కువే. బైకులు, కార్లకు పెట్రోల్, డీజిల్ బడ్జెట్ ప్రత్యేకంగా ఉండాల్సిందే. ఒకవేళ క్రెడిట్ కార్డ్ వాడే అలవాటు ఉంటే వారికి ఇది గుడ్ న్యూసే. క్రెడిట్ కార్డ్ తీసుకున్న మొదటి ఏడాది 71 లీటర్ల వరకు పెట్రోల్ ఉచితంగా పొందొచ్చు. సిటీ బ్యాంక్ ఫ్యూయెల్ క్రెడిట్ కార్డుతో లభించే బెనిఫిట్ ఇది. దీంతో పాటు ఫ్యూయెల్‌పై సర్ఛార్జ్ మినహాయింపు కూడా లభిస్తుంది. అయితే ఫ్యూయెల్‌పై సర్ఛార్జ్ మినహాయింపు అన్ని క్రెడిట్ కార్డులు ఇస్తాయి. కానీ 71 లీటర్ల వరకు ఉచితంగా పెట్రోల్ పొందే అవకాశం మాత్రం సిటీ బ్యాంక్ ఫ్యూయెల్ క్రెడిట్ కార్డుతో లభిస్తుంది. ఇందుకోసం సిటీ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని ఇండియన్ ఆయిల్ సిటీ కార్డును అందిస్తోంది.
ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డు ఉపయోగించిన ప్రతీసారి రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఏ క్రెడిట్ కార్డ్ అయినా రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. ఆ రివార్డ్ పాయింట్స్ రీడీమ్ చేసుకోవచ్చు. కానీ సిటీ బ్యాంక్ ఫ్యూయెల్ క్రెడిట్ కార్డును పెట్రోల్, డీజిల్ కోసం ఉపయోగించినప్పుడు 4 రెట్లు ఎక్కువగా రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఆ రివార్డ్ పాయింట్స్ రీడీమ్ చేసుకోవడం ద్వారా మొదటి ఏడాది 71 లీటర్ల వరకు పెట్రోల్ ఉచితంగా పొందొచ్చు. అంటే మీకు వచ్చిన రివార్డ్ పాయింట్స్‌ని నేరుగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో రీడీమ్ చేసుకొని పెట్రోల్ కొనొచ్చు. మీరు మీ జేబులోంచి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మీ ఇండియన్ ఆయిల్ సిటీ కార్డులో రివార్డ్ పాయింట్స్ ఉంటే చాలు. మీరు క్రెడిట్ కార్డును ఎక్కువగా ఉపయోగిస్తే ఎక్కువ రివార్డ్ పాయింట్స్ వస్తాయి.
ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డు తీసుకున్నవాళ్లు ఏడాదిలో రూ.30,000 ఖర్చు చేస్తే రూ.1,000 ఫీజు మినహాయింపు ఉంటుంది. కార్డ్ యాక్టివేషన్ తర్వాత రూ.250 విలువైన టర్బో పాయింట్స్ వస్తాయి. అదనంగా రూ.3,650 విలువైన టర్బో పాయింట్స్ కూడా వస్తాయి. ఇక మీరు ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్స్‌లో ప్రతీ రూ.150 బిల్లుకు 4 టర్బో పాయింట్స్ వస్తాయి. ఒక టర్బో పాయింట్ రూ.1 తో సమానం. ఇక గ్రాసరీ స్టోర్స్, సూపర్ మార్కెట్స్‌లో ప్రతీ రూ.150 బిల్లుకు 2 టర్బో పాయింట్స్ వస్తాయి. మీరు టర్బో పాయింట్స్‌ని ఎస్ఎంఎస్ ద్వారా కూడా రీడీమ్ చేసుకోవచ్చు. ఈ టర్బో పాయింట్స్ ఎక్స్పైరీ కావు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ సిటీ కార్డు తీసుకునే ముందు నియమనిబంధనలన్నీ ఓసారి పూర్తిగా చదవాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.