హోమ్ /వార్తలు /బిజినెస్ /

Stock Market: వరుసగా మూడో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్.. ఈ పతనం అగేది ఎక్కడ ?

Stock Market: వరుసగా మూడో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్.. ఈ పతనం అగేది ఎక్కడ ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Stock Market Fall: USలో పెరుగుతున్న వడ్డీ రేట్లు, తీవ్ర మాంద్యం భయాలు భారత మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అమెరికాలో మాంద్యాన్ని సహించబోమని పేర్కొంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  భారత స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజు రెడ్ మార్క్ లో ట్రేడవుతోంది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 302 పాయింట్ల నష్టంతో 17,327.05 వద్ద ట్రేడవుతుండగా, బీఎస్‌ఈ సెన్సెక్స్ 985 పాయింట్లు క్షీణించి 58,098 వద్ద ట్రేడవుతోంది. 5 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1.61 శాతానికిపైగా నష్టపోగా, నిఫ్టీ 50 కూడా ఈ కాలంలో 0.72 శాతానికిపైగా పడిపోయింది. కొన్ని దేశీయ, ప్రపంచ కారకాలు భారత స్టాక్ మార్కెట్‌పై(Stock Market) ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని నిపుణులు అంటున్నారు.

  మనీకంట్రోల్ ICICI సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం.. USలో పెరుగుతున్న వడ్డీ రేట్లు, తీవ్ర మాంద్యం(Recession) భయాలు భారత మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అమెరికాలో మాంద్యాన్ని సహించబోమని పేర్కొంది. ఇది కాకుండా చైనాలో(China) ఆర్థిక మందగమనం కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగాన్ని నెమ్మదిస్తోంది. ఇది కూడా భారత స్టాక్ మార్కెట్ పతనానికి దారితీసింది. మార్కెట్ నిపుణులు మొత్తం 5 కారణాలను తెలిపారుజ దీని కారణంగా వరుసగా మూడో రోజు భారత స్టాక్ మార్కెట్‌లో మాంద్యం ఆధిపత్యం చెలాయిస్తోంది.

  ఫెడరల్ రిజర్వ్ వైఖరి

  గత బుధవారం US సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేటును 0.75 శాతం పెంచింది. అంతేకాదు వడ్డీ రేటును పెంచుతూనే ఉంటామని పేర్కొంది. ఫెడ్ నవంబర్‌లో 0.75 శాతం, డిసెంబర్‌లో 0.50 శాతం వడ్డీ రేటును పెంచవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ప్రకారం.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును పెంచుతున్న విధానం, దీని కారణంగా, 2022-23 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో యుఎస్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్ళవచ్చు. అమెరికా పరిస్థితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది.

  భారతదేశంలో ద్రవ్యోల్బణం రేటు ఇప్పటికీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణీత పరిమితికి మించి నడుస్తోంది. మానిటరీ పాలసీ కమిటీ తదుపరి సమావేశంలో వడ్డీ రేటు 0.50 శాతం పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్‌లో కూడా ఆర్‌బీఐ వడ్డీ రేటును 0.35 శాతం పెంచవచ్చు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రెపో రేటు 6.75 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఇది కూడా స్టాక్ మార్కెట్ నుండి పెట్టుబడిదారుల విశ్వాసంపై ప్రభావం చూపింది.

  గత 40 నెలల్లో తొలిసారిగా బ్యాంకింగ్ లిక్విడిటీ తగ్గింది. లిక్విడిటీని పెంచేందుకు ఆర్‌బీఐ గురువారం వేరియబుల్ రేట్ రెపో (వీఆర్‌ఆర్) కింద రూ.50,000 కోట్లను విడుదల చేసింది. అధునాతన పన్ను డిపాజిట్ వ్యవస్థ నుండి నిధుల ఉపసంహరణ, క్రెడిట్ డిమాండ్ పెరగడం, డిపాజిట్ వృద్ధి మందగించడం వంటి కారణాల వల్ల లిక్విడిటీ క్షీణించింది. భారత మార్కెట్లలో షేర్ల ధరల పెరుగుదల కారణంగా వాల్యుయేషన్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. గ్లోబల్, ఆసియా స్టాక్‌లకు వ్యతిరేకంగా భారతీయ స్టాక్‌ల ప్రీమియం వాల్యుయేషన్ స్థిరంగా లేదని BNP పరిబాస్ తన నోట్‌లో పేర్కొంది. భారతీయ స్టాక్స్‌లో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని బిఎన్‌బి ఇన్వెస్టర్లకు సూచించింది.

  Cyber Crime: బ్యాంకింగ్, సైబర్ మోసాల నివారణపై కేంద్రం ఫోకస్.. త్వరలోనే కొత్త బిల్లు

  M&M Financial Services: మహీంద్రా ఫైనాన్స్ పై ఆర్‌బీఐ సీరియస్.. హజారీబాగ్‌ ఘటనతో చర్యలు

  భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదించడం

  అనేక రేటింగ్ ఏజెన్సీలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాను తగ్గించాయి. జూన్ త్రైమాసికంలో జిడిపి వృద్ధి గణాంకాలు కూడా చాలా ప్రోత్సాహకరంగా లేవు. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాను 7.8 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. మూడీస్ క్యాలెండర్ ఇయర్ 2022లో వృద్ధి అంచనాను 8.8 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గించింది. గోల్డ్‌మన్ సాక్స్ కూడా 2022 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను 7.6 శాతం నుండి 7 శాతానికి తగ్గించింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Stock Market

  ఉత్తమ కథలు