Fresh Works: ఉద్యోగులను కోటీశ్వరులను చేసిన రజినీకాంత్ వీరాభిమాని... ఐపీవోకు ‘ప్రాజెక్ట్ సూపర్ స్టార్’ అనే పేరు

Fresh Works: ఉద్యోగులను కోటీశ్వరులను చేసిన రజినీకాంత్ వీరాభిమాని... ఐపీవోకు ‘ప్రాజెక్ట్ సూపర్ స్టార్’ అనే పేరు (Image: Facebook/rathnagirish)

Fresh Works IPO | భారతదేశానికి చెందిన స్టార్టప్ ఫ్రెష్‌వర్క్స్ (Fresh Works) నాస్‌డాక్‌లో లిస్ట్ అయింది. రజినీకాంత్ వీరాభిమానికి చెందిన ఈ కంపెనీ ఉద్యోగులను కోటీశ్వరులను చేసింది. ఈ ఐపీవోకు ‘ప్రాజెక్ట్ సూపర్ స్టార్’ అనే పేరు పెట్టడం విశేషం.

  • Share this:
అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ నాస్‌డాక్‌లో లిస్ట్ అయిన తొలి భారత ‘సాఫ్ట్‌వేర్ ఏ సర్వీస్’ సంస్థగా ఫ్రెష్‌వ‌ర్క్స్‌ చరిత్ర సృష్టించింది. ఈ సంస్థ ప్రస్థానం మొదలైంది చెన్నైలోనే. అయితే ఈ ఫ్రెష్‌వ‌ర్క్స్‌ ఐపీవో (Fresh Works IPO) సంస్థ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ గా మారింది. భారత దేశానికి చెందిన దాదాపు 500 మంది సంస్థ ఉద్యోగులను కోటీశ్వరులను చేసింది. 30 సంవత్సరాల వయసు కూడా నిండని 70 మందిని కరోడ్‌పతులను చేసింది. ఈ సంస్థ సీఈవో గిరీశ్ మాతృభూతమ్ (Girish Mathrubootham) నిర్ణయంతోనే ఇది సాధ్యమైంది. ఉద్యోగులు సంస్థ వాటాదారులుగా ఉండాలన్న ఆయన ఆలోచనే ఉద్యోగుల పాలిట అదృష్టమైంది. సూపర్ స్టార్ రజినీకాంత్ వీరాభిమాని అయిన గిరీశ్.. అందరూ బాగుండాలన్న మంత్రాన్ని పాటిస్తున్నారు.

నాస్‌డాక్‌లో ఫ్రెష్‌వ‌ర్క్స్‌ లిస్టింగ్


నాస్‌డాక్‌లో ఫ్రెష్‌వ‌ర్క్స్‌ లిస్ట్ కావడం వల్ల గిరీశ్ సంపదే కాదు.. అందులో వాటాదారులుగా ఉన్న ఉద్యోగుల సంపద ఒక్కసారిగా పెరిగిపోయింది. ఐపీవోకు ముందు పెట్టుబడులు పెట్టిన అసెల్, సెక్వియా లాంటి సంస్థలతో పాటు వందలాది మంది ఫ్రెష్‌వ‌ర్క్స్‌ ఉద్యోగులు కోటీశ్వరులుగా మారారు.

Train Ticket Cancellation: రైలు టికెట్ క్యాన్సిల్ చేసేముందు ఈ రూల్స్ గుర్తుంచుకోండి

“ఉద్యోగులు కూడా మా వాటాదారులే. సీఈవోగా నా బాధ్యతలు నిర్వర్తించడానికి ఈ ఐపీవో ఓ అవకాశంగా వచ్చింది. పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్ట్ ఇన్వెస్టర్లు, ఉద్యోగుల కలలను నెరవేర్చేందుకు ఈ ఐపీవో ఉపయోగపడింది. అనుకున్నది సాధించవచ్చని సంస్థలో ముందుగా చేరిన ఉద్యోగులు, పెట్టుబడిదారులు నమ్మడమే మాకు కావాలి. సీఈవోగా.. పబ్లిక్ ఇన్వెస్టర్ల ఆకాంక్షలను కూడా నెరవేర్చడమే నా లక్ష్యం” అని నాస్‌డాక్‌ లో లిస్ట్ అయ్యాక గిరీశ్ మాతృభూతమ్ చెప్పారు.

“76 శాతం మంది మా ఉద్యోగులకు సంస్థ షేర్లు ఉన్నాయి. ఇది 90 శాతం కంటే ఎక్కువే ఉండాల్సింది. కానీ కొత్తగా ఎక్కువ మంది ఉద్యోగులు రావడంతో 76 శాతానికే ఉంది. భారత్ లో ఉన్న దాదాపు 500 మంది మా ఉద్యోగులు కోటీశ్వరులుగా మారారు. అందులో 70 మంది 30 సంవత్సరాల లోపువారే. కొన్ని సంవత్సరాల క్రితమే వారు కాలేజీల నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు వారి కల సాకారమైంది” అని గిరీశ్ అన్నారు.

Cheque Book: అలర్ట్... అక్టోబర్ 1 నుంచి ఈ బ్యాంకు చెక్ బుక్స్ పనిచేయవు

షేర్ ధర ఎంతంటే


నాస్‌డాక్‌లో ఫ్రెష్‌వ‌ర్క్స్‌ ఒక్కో షేరు లిస్టింగ్ ధర 36 డాలర్లు కాగా.. సెప్టెంబర్ 22న 21 శాతం పెరిగి 43.5 డాలర్ల వద్ద మార్కెట్లో లిస్ట్ అయింది. దీంతో మార్కెట్ క్యాప్ ఏకంగా 12.3 బిలియన్ డాలర్ల చేరుకుంది. దీనిలో పెట్టుబడి పెట్టిన సంస్థలకు, ఉద్యోగులకు కాసుల వర్షం కురిసింది.

సీఈవో గిరీశ్.. సూపర్ స్టార్ రజినీ వీరాభిమాని


వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు చెన్నై నుంచి అమెరికా వెళ్లినా ఫ్రెష్‌వ‌ర్క్స్‌ సీఈవో గిరీశ్ మాతృభూమత్ కు సూపర్ స్టార్ రజినీ కాంత్ అంటే అభిమానం, ఇష్టం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. 100 మిలియన్ డాలర్ల కోసం చేపట్టిన ఐపీవోకు ప్రాజెక్ట్ సూపర్ స్టార్ అని కోడ్ పెట్టారు. గిరీశ్‌కు రజనీ కాంత్ అంటే అంత అభిమానం. రజినీ కాంత్ హీరోగా నటించిన కొచ్చాడియాన్, లింగా, కబాలి సినిమాలు విడుదలైన సమయంలో తమ ఉద్యోగులకు కోసం ప్రత్యేకంగా చెన్నైలో థియేటర్లే బుక్ చేశారు గిరీశ్. అలాగే సూపర్ స్టార్ రజీనీ కాంత్ డైలాగులు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని చాలా ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పారు.
Published by:Santhosh Kumar S
First published: