భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో నడిచాయి. వాస్తవానికి జీడీపీ గణాంకాల్లో వృద్ధి మార్కెట్‌కు కలిసొస్తుందనుకున్నారు. ట్రేడింగ్ లాభాలతో మొదలైనట్టే కనిపించినా... ఏకంగా సెన్సెక్స్ 333 పాయింట్లు నష్టపోయింది. 38,313 దగ్గర నిలిచింది. నిఫ్టీ 98 పాయింట్లు నష్టపోయి 11,582 దగ్గర ఆగింది. రూపాయి విలువ కూడా మార్కెట్‌తో పోటీపడింది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.71.14. ఆల్‌టైమ్ లో రికార్డు నమోదు చేసింది. 2018లోనే రూపాయి విలువ 11 శాతం పడిపోయింది. ఆగస్టులోనే 3.6 శాతం పడిపోయింది. గత ఐదు నెలలుగా ఇదే పరిస్థితి. జీడీపీ గణాంకాల్లో వృద్ధి మార్కెట్‌కు, రూపాయికి కలిసి రాలేదని అర్థమవుతోంది. ఉదయం రూపాయి కాస్త బలపడ్డట్టు కనిపించినా... సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది.