రూపాయి మరింత పతనమవుతోంది. వరుసగా రూపీ పతనం బాట పట్టడంతో ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం రూపాయి విలువ ఏకంగా 36 పైసలు పతనంతో ప్రారంభమైంది. దీంతో డాలర్ మారకానికి రూపాయి విలువ 71.14కు పతనమైంది. ఆగస్టు 9న రూపాయి చివరి సారిగా 9 పైసలు దిగజారి 70.78కు పతనమైంది. ముఖ్యంగా అంతర్జాతీయ డాలర్ బలం పుంజుకోవడంతో పాటు ఆసియా కరెన్సీలు వెనుకంజ వేశాయి. అలాగే యూఎస్, చైనా నెలకొన్న వాణిజ్య వివాదాలు సైతం రూపాయి బలహీనతపై ప్రభావం చూపుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే రూపాయి పతనంతో చమురు దిగుమతుల ధరలు మరింత పెరిగే చాన్స్ ఉందనే భయాలు మొదలయ్యాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి ఎగిసే అవకాశం కనిపిస్తోంది. ఇక దిగుమతి చేసుకునే వస్తువులన్నింటికీ కూడా రూపీ పతనం ప్రభాం చూపే అవకాశం ఉంది.