మరింత పతనమైన రూపాయి విలువ!

మరింత పతనమైన రూపాయి విలువ!

Illustration by Mir Suhail/News18.com

రూపాయి విలువ 73.93 దగ్గర మొదలైంది. ఆ తర్వాత 73.88 తగ్గడంతో హమ్మయ్య రూపాయి బలపడుతుందని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా రూపాయి పతనమైంది. ఏకంగా 74.27 దగ్గర నిలిచింది.

 • Share this:
  డాలర్‌తో రూపాయి మారకం విలువ దారుణంగా పతనమవుతోంది. మంగళవారం 21 పైసలు పతనం కావడంతో ప్రస్తుతం ఒక డాలర్‌కు రూ.74.27 దగ్గర నిలిచింది రూపాయి. ఇది జీవనకాల కనిష్టం. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు ప్రభావం, అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరగడంతో రూపాయి పతనంవైపు పరుగులు తీస్తోంది.

  ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ 73.93 దగ్గర మొదలైంది. ఆ తర్వాత 73.88 తగ్గడంతో హమ్మయ్య రూపాయి బలపడుతుందని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా రూపాయి పతనమైంది. ఏకంగా 74.27 దగ్గర నిలిచింది. అక్టోబర్ 5న ఇంట్రాడేలో రూపాయి విలువ 74.23 వరకు చేరింది. అదే జీవనకాల కనిష్టం. ఇప్పుడు ఆ రికార్డు కూడా బద్దలైంది. 74.27 దగ్గర నిలిచి మరో ఆల్‌ టైమ్ లో రికార్డు నమోదు చేసింది.

  ఇవి కూడా చదవండి:

  లీకైన గూగుల్ ప్లస్ డేటా... ఇప్పుడు మీరేం చేయాలి?

  వాట్సప్‌లో యాడ్స్ వచ్చేశాయి!

  అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌కు మీరు రెడీనా?

  రూ.99కే ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఇన్సూరెన్స్!

  అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

  సేవింగ్స్ బ్యాంక్, పేమెంట్స్ బ్యాంక్... అకౌంట్లలో తేడాలేంటీ?

  రూ.12,999 ధరకే రెడ్‌మీ నోట్ 5 ప్రో!

  ఫేస్‌బుక్ క్లోన్ అయినట్టు మెసేజ్ వచ్చిందా?

  ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్‌ప్రో ఎం1పై భారీ డిస్కౌంట్లు!

  అక్టోబర్ 30న వన్‌ప్లస్ 6టీ లాంఛింగ్ ఈవెంట్: టికెట్ ధర రూ.999
  Published by:Santhosh Kumar S
  First published:

  అగ్ర కథనాలు