డాలర్@రూ.72.74..మరింత బక్కచిక్కిన రూపాయి

రూపాయి మారకం విలువ మరింత బక్కచిక్కిపోతూ...రికార్డు కనిష్ఠ స్థాయి(72.74)కి పతనమయ్యింది.

news18-telugu
Updated: September 11, 2018, 5:01 PM IST
డాలర్@రూ.72.74..మరింత బక్కచిక్కిన రూపాయి
మరింత క్షీణించిన రూపాయి విలువ
  • Share this:
రూపాయి విలువ మరింత బక్కచిక్కిపోతోంది. ఫోరెక్స్‌లో రూపాయి మారకం రికార్డు కనిష్ఠ స్థాయికి పతనమయ్యింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ జీవనకాల కనిష్ఠ స్థాయిలో 72.74కు పడిపోయింది.

సోమవారం రూపాయి విలువ డాలర్‌ పోలిస్తే 72 పైసలు క్షీణించి 72.45 వద్ద రికార్డు కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. ఆగస్టు 13 తర్వాత రూపాయి విలువ ఒకే రోజు ఈ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి. సోమవారంనాటి ఇంట్రా డేలో రూపాయి ఆల్ టైమ్ రికార్డు కనిష్ఠ స్థాయి 72.67ని నమోదు చేసుకుంది.

మంగళవారం ఉదయం 15 పైసలు బలపడి 72.30 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభించింది. అయితే ఆ ఆశాజనకమైన పరిస్థితులు కొద్దిసేపటికే ఆవిరయ్యాయి. క్రమంగా రూపాయి నేలచూపులు చూస్తూ రికార్డు కనిష్ఠ స్థాయి(72.74)కి పతనమయ్యింది. కొద్ది సేపటి క్రితం రూపాయి మారకం 25 పైసలు క్షీణించి 72.70 వద్ద ట్రేడ్ అవుతోంది. గత ఏడాది కాలంలో రూపాయి మారకం విలువ ఏకంగా 13 శాతం మేర క్షీణించింది.

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లుఅటు అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ భయాలు, రూపాయి విలువ పతనం, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. కేవలం రెండు ట్రేడింగ్ సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్ల మేర నష్టపోయింది. ఆగస్టు 28న నమోదైన రికార్డు గరిష్ఠ స్థాయితో పోలిస్తే సూచీలు ఏకంగా 4 శాతం మేర క్షీణించాయి. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 509 పాయింట్లు నష్టపోయి 37,413 పాయింట్ల వద్ద ముగియగా...నిఫ్టీ కూడా 151 పాయింట్లు నష్టపోయి 11,288 పాయింట్ల దగ్గర ముగిసింది. 2018 ఆగస్టు 2 తేదీ తర్వాత సూచీలు ఈ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి.
First published: September 11, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు