బలపడిన రూపాయి విలువ...మార్కెట్లో బుల్ జోరు

గత కొన్ని రోజులుగా రోజురోజుకూ బక్కచిక్కిపోతున్న రూపాయి మారకం విలువ..గత వారం రోజుల గరిష్ఠ స్థాయి వద్ద ట్రేడింగ్ అవుతోంది.

news18-telugu
Updated: September 21, 2018, 12:04 PM IST
బలపడిన రూపాయి విలువ...మార్కెట్లో బుల్ జోరు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 21, 2018, 12:04 PM IST
ఫోరెక్స్‌లో రూపాయి మారకం విలువ బలపడింది. 60 పైసలు పుంజుకున్న రూపాయి విలువు...గత వారం రోజుల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 71.76కు చేరుకుంది. గురువారం మొహర్రం సందర్భంగా మార్కెట్‌కు సెలవుదినం కాగా...బుధవారం రూపాయి విలువ 72.37 వద్ద ముగిసింది. శుక్రవారం 52 పైసలు లాభంతో 71.85 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.

రూపాయి విలువ బలపడడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనుకూల పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. శుక్రవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడింది. ఆ తర్వాత లాభాలను కొంత మేర కోల్పోయింది. కొద్ది సేపటి క్రితం సెన్సెక్స్ 232 పాయింట్ల లాభంతో 37353 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది.

అటు నిఫ్టీ కూడా 63 పాయింట్ల లాభంతో 11,297 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

 

First published: September 21, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...