హోమ్ /వార్తలు /బిజినెస్ /

Rupee Fall: తొలిసారి 82 రూపాయలు దాటిన డాలర్... మీకెలా నష్టమంటే

Rupee Fall: తొలిసారి 82 రూపాయలు దాటిన డాలర్... మీకెలా నష్టమంటే

Rupee Fall: తొలిసారి 82 రూపాయలు దాటిన డాలర్... మీకెలా నష్టమంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Rupee Fall: తొలిసారి 82 రూపాయలు దాటిన డాలర్... మీకెలా నష్టమంటే (ప్రతీకాత్మక చిత్రం)

Rupee Fall | డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ (Rupee Value) దారుణంగా పతనం అవుతోంది. తొలిసారి 82 మార్క్ దాటింది. రూపాయి బలహీనపడితే అనేక రంగాలపై ఆ ప్రభావం ఉంటుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రూపాయి పతనం కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ (Rupee Value) మరింత బలహీనపడింది. తొలిసారి 82 మార్క్ దాటింది. క్రూడ్‌తో పాటు యూఎస్ బాండ్ రాబడుల విలువ పెరగడంతో రూపాయి మరింత పతనం అయింది. ఉదయం 11 గంటలకు ఒక డాలర్ 82.35 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. మూడు నెలల క్రితం డాలర్ విలువ (Dollar Value) 80 రూపాయలు దాటిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 82 రూపాయల మార్క్ దాటింది. అంటే ఒక అమెరికా డాలర్ మారిస్తే రూ.82.35 చెల్లించాలి. మీరు ఒక డాలర్ కొనాలంటే రూ.82.35 కావాలి. అంటే అమెరికాలో ఉన్నవారికి 1000 డాలర్లు పంపాలంటే భారతీయులు రూ.82,350 చెల్లించాలి.

రూపాయి పతనంతో నష్టాలివే

రూపాయి పతనంతో అనేక నష్టాలున్నాయి. రూపాయి బలహీనపడినకొద్దీ దిగుమతులు మరింత భారం అవుతుంటాయి. ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువులకు డాలర్లలో చెల్లించాల్సి వస్తుంది కాబట్టి రూపాయి ఎంత పతనం అయితే అంత ఎక్కువ చెల్లించాలి. ఉదాహరణకు ఏవైనా వస్తువులు దిగుమతి చేసుకుంటే 1,00,000 డాలర్లు చెల్లించాలనుకుందాం. రూపాయి విలువ 80 ఉన్నప్పుడు రూ.80,00,000 చెల్లిస్తే సరిపోతుంది. కానీ రూపాయి పతనం అయి 82.35 కి చేరుకుంది కాబట్టి ఇప్పుడు రూ.82,35,000 చెల్లించాలి.

EPF Interest: ఈపీఎఫ్ వడ్డీ జమ కాలేదా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

రూపాయి ఇలా పతనం కావడం అనేక రంగాలపై ప్రభావం చూపిస్తుంది. భారతదేశంలో దిగుమతులపై ఆధారపడుతన్న రంగాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, మెటల్, పెట్రోల్ వంటి రంగాలపై ప్రభావం తప్పదు. రూపాయి పతనం కారణంగా వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది. రూపాయి పతనం అయితే ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఇన్వెస్టర్లకు కూడా ఇబ్బందులు తప్పవు. రూపాయి పడిపోవడం, దిగుమతి రంగాలకు ఖర్చులు పెరగడం, వాటి ఆదాయాలకు గండి పడటం లాంటి పరిణామాలు ఉంటాయి.

ఇక విదేశాల్లో చదువుకునేవారి ఖర్చులు మరింత పెరుగుతాయి. విదేశాల్లో చదువుతున్న తమ పిల్లలకు తల్లిదండ్రులు భారతదేశం నుంచి డబ్బులు పంపాలంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. విదేశీ పర్యటనలు కూడా మరింత భారం అవుతాయి. డాలర్లు పెట్టి కొనే ప్రతీ వస్తువుకు, సేవకు అదనంగా చెల్లించాలి.

Credit Card Tips: క్రెడిట్ కార్డ్ తీసుకున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి

రూపాయి పతనంతో లాభపడే రంగాలివే

రూపాయి పతనంతో కొన్ని రంగాలకు లాభం ఉంటుంది. భారతదేశం నుంచి ఎగుమతులు చేసి డాలర్లతో చెల్లింపు చేసే పరిశ్రమలకు, సంస్థలకు లాభం ఎక్కువగా ఉంటుంది. వారికి డాలర్లలో చెల్లింపులు వస్తాయి కాబట్టి డాలర్లను మార్చుకుంటే ఎక్కువ రూపాయలు వస్తాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాసూటికల్, స్పెషాలిటీ కెమికల్స్, టెక్స్‌టైల్స్ కంపెనీలు లాభపడతాయి.

ఓసారి చరిత్ర చూస్తే స్వాతంత్ర్యం వచ్చినప్పుడు డాలరుతో రూపాయి మారకం విలువ 4.16 ఉండేది. అంటే అప్పుడు ఒక డాలరు మన కరెన్సీతో పోలిస్తే రూ.4.16 తో సమానం. ఆ తర్వాత రూపాయి బలహీనపడుతూ, డాలర్ బలపడుతూ వచ్చింది. చరిత్రలో తొలిసారి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82 దాటింది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Personal Finance, Rupee value

ఉత్తమ కథలు