• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • INDIAN RUPEE AT FRESH RECORD LOW BREACHES 71 FOR THE FIRST TIME

డాలర్@రూ.71...జీవితకాల కనిష్ఠ స్థాయికి రూపాయి!

డాలర్@రూ.71...జీవితకాల కనిష్ఠ స్థాయికి రూపాయి!

ప్రతీకాత్మక చిత్రం..

ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 71కి క్షీణించింది.

  • Share this:
    ఫోరెక్స్‌లో రూపాయి మారకం విలువ మరింత క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ఠ స్థాయిలో తొలిసారిగా 71కి పడిపోయింది. గురువారం 70.74 వద్ద ముగిసిన రూపాయి...శుక్రవారం ఉదయం మరో 21 పైసలు నష్టంతో 70.95 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత మరింతగా క్షీణించి డాలర్‌తో పోలిస్తే జీవితకాల కనిష్ఠ స్థాయిలో 71కి రూపాయి మారకం విలువ పడిపోయింది.

    ముడి చమురు ధరలు భారీగా పెరగడం, అమెరికా డాలర్‌కు డిమాండ్ పెరగడం రూపాయి విలువపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుపోంది. అలాగే అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ భయాలు కూడా రూపాయి క్షీణితకు కారణం అవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి విలువ దాదాపు 11 శాతం మేరకు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 72 వరకు క్షీణించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు.

    డాలర్‌తో పోల్చితే జీవితకాల కనిష్ఠ స్థాయిలో 71కి పడిపోయిన రూపాయి మారకం విలువ
    డాలర్‌తో పోల్చితే జీవితకాల కనిష్ఠ స్థాయిలో 71కి పడిపోయిన రూపాయి మారకం విలువ


    అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 77 పాయింట్ల నష్టంతో 38613 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా...నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 11658 పాయింట్ల దగ్గర ట్రేడ్ కొనసాగిస్తోంది. యస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, వేదాంత, మహీంద్ర అండ్ మహీంద్ర తదితర షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
    Published by:Janardhan V
    First published:

    అగ్ర కథనాలు