INDIAN RAILWAYS WILL DECREASE PASSENGER FARES BY 15 PERCENT ACROSS 1700 TRAINS SOON HERE FULL DETAILS NS GH
Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో భారీగా తగ్గనున్న టికెట్ ధరలు.. ఎంతంటే?
ప్రతీకాత్మక చిత్రం
కోవిడ్ (Covid) మహమ్మారి సమయంలో ప్రారంభించిన ప్రత్యేక రైళ్లను(Special Trains) సాధారణ రైలు సేవలతో భర్తీ చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణికుల ఛార్జీలు దాదాపు భారీగా తగ్గుతాయని రైల్వే మంత్రిత్వ శాఖకు (Railway Ministry) చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.
కరోనా(Corona) మహమ్మారి కారణంగా ఆగిపోయిన ప్యాసింజర్ రైళ్లు (Passenger Trains) తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు భారతీయ రైల్వే(Indian Railways) గతవారమే నిర్ణయం తీసుకుంది. ఆయా రైళ్ల కార్యకలాపాలను పునఃప్రారంభించాలని.. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు (Express Trains) ఉన్న స్పెషల్ ట్రైన్ ట్యాగ్‌ను తొలగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తక్షణమే అమల్లోకి వచ్చేలా ప్రీ-పాండమిక్ టిక్కెట్ ధరలను మార్చాలని జోనల్ రైల్వేలను (Railway Zones) ఆదేశించింది. ఈ చర్యతో రైల్వే ప్రయాణ ఛార్జీలు దాదాపు 15% తగ్గుతాయని భావిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రారంభించిన ప్రత్యేక రైళ్లను సాధారణ రైలు సేవలతో భర్తీ చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణికుల ఛార్జీలు దాదాపు 15% వరకు తగ్గుతాయని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. కొవిడ్ సమయంలో 'స్పెషల్ ట్రైన్స్' అని ట్యాగ్ చేసిన దాదాపు 1,700 రైళ్లలో రానున్న రోజుల్లో ఛార్జీలు తగ్గనున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో... జాతీయ రవాణా సంస్థ 1,180.19 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకువెళ్లింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 69.88 మిలియన్లకు చేరుకుంది. భారతీయ రైల్వేలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు వరకు ప్రయాణికుల ఛార్జీల ద్వారా రూ. 15,434.18 కోట్లు ఆర్జించింది. సెప్టెంబర్ 2020 వరకు రూ. 1,258.74 కోట్లకు పెరిగింది.
కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి తీసుకున్న ఇతర చర్యలను కొనసాగించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. కౌంటర్లో టిక్కెట్ల విక్రయాలపై ఆంక్షలు... రైళ్లలో వండిన ఆహారాన్ని పంపిణీ చేయకపోవడం, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ల అధిక ధరలపై ఆంక్షలు విధించారు. “రైల్వే స్టేషన్లలో రద్దీని నివారించడం కోసం ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ల ధరలు పెంచాం. కొవిడ్ మహమ్మారి ఇంకా పూర్తి స్థాయిలో తొలగిపోనందున టిక్కెట్ల ఓవర్-ది-కౌంటర్ విక్రయాలు, భారతీయ రైల్వేలో వండిన ఆహారాన్ని అందించడంపై ఆంక్షలు కొనసాగిస్తాం” అని ఓ అధికారి చెప్పారు. Railway Zone: టికెట్ లేని ప్రయాణికుల నుంచి.. ఎన్ని రూ. కోట్లు వసూలు చేశారో తెలుసా..
కార్యకలాపాలను సాధారణీకరించడానికి రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ప్రయాణికుల రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్)ను వచ్చే 7 రోజుల పాటు రద్దీ తక్కువగా ఉండే రాత్రి సమయంలో ఆరు గంటల పాటు మూసివేయాలని నిర్ణయించింది. సిస్టమ్ డేటా అప్ గ్రేడేషన్, కొత్త రైలు నంబర్ల అప్డేట్లను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.