రైల్వే టికెట్లపై సబ్సిడీని ఎత్తేస్తారా... రైల్వేలో ఏం జరుగుతోంది?

Indian Railways : 2019-20లో రూ.56వేల కోట్ల ఆదాయం సాధించాలనుకుంటున్న రైల్వే... ఈ సబ్సిడీ గివ్ ఇట్ అప్ స్కీమ్‌ను తేవాలనుకుంటోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 23, 2019, 10:48 AM IST
రైల్వే టికెట్లపై సబ్సిడీని ఎత్తేస్తారా... రైల్వేలో ఏం జరుగుతోంది?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏం చేసినా ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఇండియర్ రైల్వే పనిచేస్తోంది. తాజాగా... గివ్ ఇట్ అప్ స్కీమ్ ఒకటి తేబోతోంది. ఇదేంటో తెలియాలంటే... ముందు మీకో విషయం గుర్తు చెయ్యాలి. ప్రస్తుతం రైల్వే ప్రయాణాలకు అవుతున్న ఖర్చులో 53 శాతం మాత్రమే రైల్వే శాఖ తీసుకుంటోంది. అంటే... మనం ఓ ప్రయాణం చెయ్యడానికి రైల్వే శాఖకు రూ.100 ఖర్చైతే... రైల్వే శాఖ మన దగ్గర రూ.53 మాత్రమే తీసుకుంటోంది. మిగతా 47 రూపాయల్ని సబ్సిడీగా ఇస్తోంది. అందువల్ల మనం తక్కువ ఖర్చుకే ప్రయాణిస్తు్న్నాం. ఈ సబ్సిడీని ఎత్తివేసే ఆలోచనలో రైల్వే లేదుగానీ... ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. మీకు గుర్తుండే ఉంటుంది... ఇదివరకు వంటగ్యాస్‌పై సబ్సిడీని ప్రజలు స్వయంగా రద్దు చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. దాంతో చాలా మంది సబ్సిడీని రద్దు చేసుకున్నారు. అదే విధంగా... రైల్వే టికెట్ల విషయంలోనూ సబ్సిడీని రద్దు చేసుకోవాలని ప్రధాని పిలుపు ఇవ్వాలని రైల్వే కోరుకుంటోంది. ఇలాంటి కొన్ని అంశాలతో 100 రోజుల ప్లాన్‌ రిపోర్టును ప్రధాని కార్యాలయానికి పంపింది.

రైల్వే టికెట్లపై సబ్సిడీని వదులుకునేందుకు సిద్ధమయ్యే ప్రయాణికులు ఆ విధంగా టికెట్లు కొనుక్కునేలా సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) కొన్ని మార్పులు చెయ్యబోతోంది. రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ వెబ్‌సైట్లలో ఈ మార్పులు ఉండబోతున్నాయి. ఓ అంచనా ప్రకారం ఏటా రైల్వే శాఖ... టికెట్ల అమ్మకాల ద్వారా రూ.50వేల కోట్లు ఆదాయం పొందుతున్నట్లు తెలిసింది.

2019-20లో రూ.56వేల కోట్ల ఆదాయం సాధించాలనుకుంటున్న రైల్వే... ఈ సబ్సిడీ గివ్ ఇట్ అప్ స్కీమ్‌ను తేవాలనుకుంటోంది. ఎక్కువ మంది ప్రయాణికులు సబ్సిడీని వదులుకునేలా... వీలైనంత ఎక్కువగా ఈ స్కీమ్ గురించి ప్రచారం చెయ్యాలనుకుంటోంది. గత రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆలోచన ఇది. అప్పట్లో ప్రతిపక్షాలు భగ్గుమనడంతో... తన ఆలోచనను అమల్లోకి తేలేకపోయారు.

వంటగ్యాస్‌పై సబ్సిడీని వదులుకోమని ప్రధాని కోరినప్పుడు 1.25 కోట్ల మంది పాజిటివ్‌గా స్పందించారు. రైల్వే శాఖ కూడా అదే రెస్పాన్స్ కోరుకుంటోంది. ఇష్టం ఉన్నవారు సబ్సిడీని వదులుకుంటారు. కుదరదనుకునేవారు సబ్సిడీతోనే టికెట్స్ కొనుక్కుంటారు. 

ఇవి కూడా చదవండి :

పేగుల్లో కాన్సర్‌ను కనిపెట్టే మినీ రోబో... లండన్ సైంటిస్టుల సృష్టి...వరి పంటను కాపాడే రోబో... జపాన్ ఇంజినీర్ల సృష్టి

4 రోజుల తర్వాత శుభకార్యాలు లేవ్... 3 నెలల వరకూ అంతే...

ఎకనమిక్ పాలసీపై ప్రధాని మోదీ దృష్టి - ఆర్థికవేత్తల సలహాలు స్వీకరణ
First published: June 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు