హోమ్ /వార్తలు /బిజినెస్ /

Indian Railways: రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై ఆ సేవలు ఆన్‌లైన్‌లోనే.. వివరాలివే..

Indian Railways: రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై ఆ సేవలు ఆన్‌లైన్‌లోనే.. వివరాలివే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Indian Railways: ప్రయాణికులకు రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉండేలా భారతీయ రైల్వే సంస్థ సరికొత్త ఆన్‌లైన్‌ సేవలను తీసుకొస్తోంది. తాజాగా స్మార్ట్ కార్డులు కలిగి ఉన్న ప్రయాణికుల కోసం అత్యంత ఉపయోగకరమైన ఆన్‌లైన్‌ సర్వీస్‌ను పరిచయం చేసింది. ఇకపై ఈ స్మార్ట్ కార్డులను ఆన్‌లైన్‌లోనే రీఛార్జ్ చేసుకోవచ్చని ప్రకటించింది. పూర్తి వివరాలివే..

ఇంకా చదవండి ...

ప్రయాణికులకు రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉండేలా భారతీయ రైల్వే సంస్థ సరికొత్త ఆన్‌లైన్‌ సేవలను తీసుకొస్తోంది. తాజాగా స్మార్ట్ కార్డులు కలిగి ఉన్న ప్రయాణికుల కోసం అత్యంత ఉపయోగకరమైన ఆన్‌లైన్‌ సర్వీస్‌ను పరిచయం చేసింది. ఇకపై ఈ స్మార్ట్ కార్డులను ఆన్‌లైన్‌లోనే రీఛార్జ్ చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే ఇందుకు 'UTSonmobile' వెబ్ పోర్టల్‌లో రిజిస్టర్ కావలసి ఉంటుంది. ఈ ఆన్‌లైన్‌ సర్వీస్‌ను అందుబాటులోకి తెస్తూ.. తాజాగా దక్షిణ మధ్య రైల్వే జోన్ ఒక ప్రకటన జారీ చేసింది. స్మార్ట్ కార్డులు ఉపయోగించి అన్‌రిజర్వ్‌డ్/రిజర్వ్ చేయని టిక్కెట్లు, ప్లాట్‌ఫాం టిక్కెట్లను కొనుగోలు చేయొచ్చన్న విషయం తెలిసిందే. గతంలో రైలు ప్రయాణికులు తమ ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్ (ATVM) స్మార్ట్ కార్డులను రీఛార్జ్ చేసుకోవాలంటే రైల్వే స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్ల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. కానీ తాజా సర్వీస్‌తో ఇకపై ఏ ప్రయాణికుడు కూడా బుకింగ్ కౌంటర్ వద్ద క్యూలో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. దాంతో ప్రయాణికులు గుమికూడా కుండా నివారించవచ్చు. కరోనా సమయంలో ఈ సర్వీస్ చాలా ఉపయోగపడుతుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో పేర్కొంది.

ఈ ఆన్‌లైన్‌ సేవలను ఎలా పొందాలి..?

1. రైలు ప్రయాణికులు www.utsonmobile.indianrail.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.

2. మెనూలో "స్మార్ట్ కార్డ్ రీఛార్జ్" ఆప్షన్ పై క్లిక్ చేయండి.

3. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, యూపీఐ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా రీఛార్జ్ డబ్బు చెల్లించవచ్చు.

4. పేమెంట్ కన్ఫామ్ చేసిన తర్వాత నగదు కట్ అవుతుంది. తరువాత ప్రయాణికులు 15 రోజుల వ్యవధిలో లేదా కార్డ్ గడువు ముగిసేలోపు సంబంధిత జోన్ 'ఏటీవీఎం' (ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్) వద్దకు వెళ్ళాలి.

5. స్మార్ట్ కార్డ్‌ని ఏటీవీఎం రీడర్‌లో ఉంచాలి. "రీఛార్జ్ స్మార్ట్ కార్డ్" ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు ఏటీవీఎం ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్ రీఛార్జ్ వివరాలను సేకరించి.. మీరు ఆన్‌లైన్‌లో చెల్లించిన మొత్తాన్ని స్మార్ట్ కార్డ్‌లోకి ట్రాన్సఫర్ చేస్తుంది.

6. ఇప్పుడు టికెట్లు కొనుగోలు చేయడానికి స్మార్ట్ కార్డ్ లో బ్యాలెన్స్ అందుబాటులో ఉంటుంది. ఈ బ్యాలెన్స్ ఉపయోగించి సంబంధిత జోన్ పరిధిలోని ఏ ఏటీవీఎం లోనైనా టికెట్ కొనుగోలు చేయొచ్చు.

First published:

Tags: Indian Railway, Indian Railways, News online, South Central Railways

ఉత్తమ కథలు