Indian Railways: ప్రైవేటు రైళ్ల చార్జీల విషయంలో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయం ఇదే..

Indian Railways: రైల్వే ఛార్జీలను విమాన టిక్కెట్ల తరహాలోనే డిమాండ్ కు తగ్గట్లు ప్రైవేటు కంపెనీలు మార్చే వీలుంది. చార్జీలపై ఎలాంటి అప్పర్ లిమిట్ ఉండదని ఇప్పటికే రైల్వే శాఖ స్పష్టం చేసింది. డిమాండ్ ఉన్న మార్గాల్లో ప్రైవేట్ కంపెనీలు తమకు కావలసినంత చార్జీలు వసూలుకోవచ్చు.

news18-telugu
Updated: August 2, 2020, 6:03 PM IST
Indian Railways: ప్రైవేటు రైళ్ల చార్జీల విషయంలో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయం ఇదే..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
Indian Railways: ప్రైవేటు కంపెనీలు నడిపే రైళ్ల చార్జీలను వారే స్వయంగా నిర్ణయించుకుంటారని, చార్జీల పెంపుదలపై రైల్వే శాఖ జోక్యం ఉండదని, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఛార్జీల ఆయా కంపెనీలే నిర్ణయం తీసుకుంటాయన్నారు. రిపోర్ట్స్ ప్రకారం రైల్వే ఛార్జీలను విమాన టిక్కెట్ల తరహాలోనే డిమాండ్ కు తగ్గట్లు ప్రైవేటు కంపెనీలు మార్చే వీలుంది. చార్జీలపై ఎలాంటి అప్పర్ లిమిట్ ఉండదని ఇప్పటికే రైల్వే శాఖ స్పష్టం చేసింది. డిమాండ్ ఉన్న మార్గాల్లో ప్రైవేట్ కంపెనీలు తమకు కావలసినంత చార్జీలు వసూలుకోవచ్చు. ఈ ఛార్జీల కోసం వారు ఎటువంటి అనుమతి పొందవలసిన అవసరం లేదు. ఈ కంపెనీలు భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో రైళ్లను నడుపుతాయి మరియు దీని కోసం వారు కోరుకున్న ఛార్జీలను నిర్ణయించవచ్చు. ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రైవేటు రైల్వేలు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే వీలుంది.

రైల్వే ఛార్జీలు మార్కెట్ ప్రకారం ఉంటాయి...

ఇటీవల రైల్వే మంత్రి పియూష్ గోయల్ చార్జీల నిర్ణయంపై స్పష్టం చేశారు. ఇటీవలి ప్రీ-అప్లికేషన్ సమావేశంలో ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. మొత్తం 109 మార్గాల్లో 35 సంవత్సరాల పాటు ప్రభుత్వం 151 రైళ్లను ప్రైవేట్ సంస్థలకు అందించనుంది. ఈ విషయంలో ఇటీవల లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా రైల్వే మాట్లాడుతూ ప్రైవేట్ రైలు ఛార్జీలను నడుపుతున్న సంస్థలే నిర్ణయిస్తాయని చెప్పారు. ఈ ఛార్జీలు మార్కెట్ కు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చార్జీల విషయంలో ఎలాంటి అనుమతి అవసరం లేదు. నిజానికి రైల్వే చార్జీల పెంపునకు భారత రైల్వే కేబినెట్ లేదా పార్లమెంటు అనుమతి తీసుకోవలసి ఉంటుంది. రైల్వే చట్టం ప్రకారం, దేశంలోని కేంద్ర ప్రభుత్వం లేదా రైల్వే మంత్రిత్వ శాఖ మాత్రమే ప్రయాణీకుల రైలు ఛార్జీలను నిర్ణయించగలదు.

ప్రస్తుత రైళ్ల ఛార్జీల కంటే చాలా ఎక్కువ ఉంటుంది
ప్రైవేట్ రైళ్ల ఛార్జీలు ప్రస్తుత రైళ్ల ఛార్జీల కంటే చాలా ఎక్కువగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ రైళ్లలో ఛార్జీలను నిర్ణయించే అధికారం రైల్వే శాఖకు లేదు. ఈ రైళ్ల కంపెనీలు తమ వెబ్‌సైట్‌లో టికెట్లను అమ్మే వీలుంది.

రైళ్ల ప్రైవేటీకరణతో రైళ్ల వేగం, కోచ్‌ల సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త మార్పులు చోటుచేసుకునే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా, ప్రతి 4,000 కిలోమీటర్ల తర్వాత కూడా నిర్వహణ అవసరమయ్యే రైలు కోచ్‌ల కోసం ఈ పరిమితిని సుమారు 40,000 కిలోమీటర్లకు పెంచనున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
Published by: Krishna Adithya
First published: August 2, 2020, 6:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading