Railways: రైళ్లల్లో ఫ్రీగా సినిమాలు చూడొచ్చు... త్వరలో వీడియో సర్వీసులు

సినిమాలతో పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయి. రైళ్లల్లో ఏర్పాటు చేసే మీడియా సర్వర్లలో వేర్వేరు భాషల్లో సినిమాలు, మ్యూజిక్ వీడియోలు, లైఫ్‌స్టైల్ కార్యక్రమాలు ఉంటాయి.

news18-telugu
Updated: January 19, 2020, 6:45 PM IST
Railways: రైళ్లల్లో ఫ్రీగా సినిమాలు చూడొచ్చు... త్వరలో వీడియో సర్వీసులు
Railways: రైళ్లల్లో ఫ్రీగా సినిమాలు చూడొచ్చు... త్వరలో వీడియో సర్వీసులు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తరచూ రైళ్లల్లో ప్రయాణించేవారికి శుభవార్త. మీ రైలు ప్రయాణం బోర్ కొట్టదు. ఎంచక్కా రైళ్లల్లో సినిమాలు చూడొచ్చు. భారతీయ రైల్వే ప్రయాణికులకు అందించబోతున్న ఎంటర్‌టైన్‌మెంట్ సేవలు ఇవి. 2020 నుంచి రైళ్లల్లో సినిమాలతో పాటు స్పెషల్ షోస్, విద్యాసంబంధమైన కార్యక్రమాలు, వీడియోలను ప్రసారం చేయనుంది భారతీయ రైల్వే. ఉచితంగానే కాదు... డబ్బులు చెల్లించి మరీ మీరు కోరుకున్న సినిమాలు చూడొచ్చు. భారతీయ రైల్వేకు చెందిన టెలికాం సంస్థ అయిన రైల్‌టెల్ ఈ సేవలు అందించేందుకు జీ ఎంటర్‌టైన్‌మెంట్ అనుబంధ సంస్థ అయిన మార్గో నెట్‌వర్క్‌తో 10 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లల్లో కూడా ఈ సేవలు అందించనుంది. 2022 నాటికి పూర్తి స్థాయిలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభవాన్ని అందించడమే కాకుండా, రైల్వేకు ఛార్జీయేతర ఆదాయం కూడా పెరుగుతుంది.

అన్ని ప్రీమియం, ఎక్స్‌ప్రెస్, మెయిల్, సబర్బన్ రైళ్లల్లో మరో రెండేళ్లలో ఎంటర్‌టైన్‌మెంట్ సేవలు అందనున్నాయి. అందులో సినిమాలతో పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయి. రైళ్లల్లో ఏర్పాటు చేసే మీడియా సర్వర్లలో వేర్వేరు భాషల్లో సినిమాలు, మ్యూజిక్ వీడియోలు, లైఫ్‌స్టైల్ కార్యక్రమాలు ఉంటాయి. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వాటిని ఎంజాయ్ చేయొచ్చు. ఎలాంటి అంతరాయం లేకుండా ఉచితంగా కంటెంట్ చాలా లభిస్తుంది. దాంతో పాటు రెగ్యులర్‌గా రైళ్లల్లో ప్రయాణించేవారికి సబ్‌స్క్రిప్షన్ ద్వారా కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్లలోనే సినిమాలు, కార్యక్రమాలు చూడొచ్చు. 17 రైల్వే జోన్లలోని 8,731 రైళ్లల్లో ఎంటర్‌‌టైన్‌మెంట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు... వైఫై సదుపాయం ఉన్న 5,563 రైల్వే స్టేషన్లలో కూడా ఈ సేవలు లభిస్తాయి.

ఇవి కూడా చదవండి:

IRCTC: ప్రేమికులకు గుడ్ న్యూస్... 'వాలెంటైన్స్ డే టూర్' తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ



IRCTC: ఆ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేయొద్దంటున్న ఐఆర్‌సీటీసీ

IRCTC Ramayana Yatra: శ్రీరామ భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్ర... ప్యాకేజీ వివరాలివే
First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు